Home /News /crime /

HYDERABAD WOMAN FACING HARASSMENT FROM HER LOVER EVEN AFTER SHE HAVE MARRIED WITH AUSTRALIA NRI HSN

ప్రియుడితో బ్రేకప్.. వేరే వ్యక్తితో పెళ్లి.. ఆస్ట్రేలియాలో కాపురం.. నెట్టింట కనిపించిన తన నగ్న ఫొటోలను చూసి ఆమెకు షాక్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎనిమిది నెలల్లోనే ప్రేమకు బ్రేకప్ ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. భర్తతో హ్యపీగా సంసారం చేసుకుంటోంది. అయితే గతం ఆమెను వెంటాడింది. సోషల్ మీడియాలో సడన్ గా ఆమె నగ్న చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

    కాలేజీ రోజుల్లో వారిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. ఇదే క్రమంలో తన ప్రియురాలిని మాటలతో ఏమార్చి, మభ్యపెట్టి, చనిపోతానని బెదిరించి మరీ ఆమె నుంచి నగ్న చిత్రాలు, వీడియోలు తీసుకున్నాడు. కానీ ఊహించని రీతిలో వాళ్ల మధ్య ఉన్న బంధానికి బీటలు వారాయి. ఎనిమిది నెలల్లోనే వారి ప్రేమకు బ్రేకప్ పడింది. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. భర్తతో హ్యపీగా సంసారం చేసుకుంటోంది. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే గతం ఆమెను వెంటాడింది. సోషల్ మీడియాలో సడన్ గా ఆమె నగ్న చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది మాజీ ప్రియుడి పనేనని ఆమె గ్రహించింది. మొదటిసారి ఎలాగోలా ఆ ఫొటోలను తీసేయించినా, మళ్లీ మళ్లీ అదే పనిగా ఫొటోలు నెట్టింట కనిపించడంతో చివరకు కోర్టు మెట్లెక్కింది.

    హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతికి పదేళ్ల క్రితమే పెళ్లయింది. భర్తతోపాటు ఆస్ట్రేలియాలోనే స్థిరపడింది. ప్రస్తుతం ఆ జంటకు అయిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే 2012వ సంవత్సరంలో సడన్ గా నెట్టింట ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. గతంలో కాలేజీ రోజుల్లో ఓ కుర్రాడిని ప్రేమించడం,, అతడి మాయ మాటల వల్ల నగ్న వీడియోలు, ఫొటోలు అతడికి పంపించడం ఆమెకు గుర్తుకొచ్చింది. మాజీ ప్రియుడి నిర్వాకమేనని ఆమె గ్రహించింది. వెంటనే పోలీసులకు పిర్యాదు చేస్తే ఆ పొటోలను సామాజిక మాధ్యమాల నుంచి తీసేయించారు. మాజీ ప్రియుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ 2019లో కూడా అవే ఫొటోలు నెట్టింట కనిపించాయి.
    ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

    ఈ ఘటనపై ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, గూగుల్ కు ఆమె లేఖలు రాసినా స్పందన లేదు. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలనీ, తన సమస్యను తీర్చాలని విన్నవించుకుంది. అయితే ఆమె మాజీ ప్రియుడు మాత్రం ఆ ఫోటోలను తాను నెట్టింట పెట్టలేదంటూ వాపోతున్నాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం గూగుల్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం తదితర సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కూడా అడిగింది. అదే సమయంలో ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా లేఖను రాయాలంటూ పిటిషనర్ కు సూచించింది. మార్చి 30వ తారీఖునకు విచారణను వాయిదా వేసింది.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Hyderabad, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు