హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కలకలం.. మహిళ దారుణ హత్య

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కలకలం.. మహిళ దారుణ హత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే ఓ మహిళ హత్య తీవ్ర కలకలం రేపుతోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే ఓ మహిళ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలోని ఎన్‌ఎండీసీ సర్కిల్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. మహిళా మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉందని చెప్పారు. మహిళ వయసు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

శంషాబాద్‌తో పాటు సమీప పోలీస్ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో మహిళపై పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ ని రప్పించి ఘటన స్థలంలోని వివరాలు సేకరించామని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. నిత్యం వాహనాల రాకపోకలు సాగించే ప్రాంతంలో ఇటువంటి ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

మరోవైపు మహిళను రేప్ చేసిన అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

First published:

Tags: Crime news, Hyderabad, Murder, Shamshabad Airport

ఉత్తమ కథలు