భర్త వేధింపులు తాళలేక.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య..

భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందో వివాహిత. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: February 26, 2020, 11:43 AM IST
భర్త వేధింపులు తాళలేక.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందో వివాహిత. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో ఉన్న రోడ్ నంబర్ 10లో నివాసం ఉంటున్న సౌమ్య అనే వివాహిత ఉరేసుకుంది. భర్త రాఘవేంద్ర వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భార్య ఆత్మహత్య విషయం తెలియగానే భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు అతడ్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సౌమ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 26, 2020, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading