news18-telugu
Updated: December 31, 2019, 9:35 AM IST
చరితా రెడ్డి (ఫైల్)
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అక్కడి మిచిగాన్లోని లాన్సింగ్లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న చరితా రెడ్డి(26) కారు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యింది. తన కారులో వెళ్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, నిందితుడు మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
December 31, 2019, 9:35 AM IST