ప్రియుడి కోసం భర్తను జైలుకు పంపిన భార్య... వేధిస్తున్నాడంటూ... హైదరాబాద్‌లో దారుణం...

హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో దారుణం... సీసీటీవీ బిగించేందుకు వచ్చి, మాయమాటలతో ఇద్దరు పిల్లల తల్లిని లొంగదీసుకున్న టెక్నీషియన్... ఆ సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో భర్తపైనే రివర్స్ కేసు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 6, 2019, 6:51 PM IST
ప్రియుడి కోసం భర్తను జైలుకు పంపిన భార్య... వేధిస్తున్నాడంటూ... హైదరాబాద్‌లో దారుణం...
(File)
  • Share this:
వివాహేతర సంబంధాలు కాపురాలను కూలుస్తున్నాయి. తాజాగా ప్రియుడితో వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయిందని, అతనిపైనే రివర్స్ కేసు పెట్టిందో భార్య. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది. నాచారంలో నివాసం ఉండే చంద్రశేఖర్, సీసీటీవీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. సీసీటీవీ బిగించే సమయంలో సదరు ఇంటి ఆడవాళ్లతో పరిచయం పెంచుకుని, మాయ మాటలు చెప్పి లొంగదీసుకునేవాడు. వారితో లైంగిక సంబంధం ఏర్పరచుకుని, దొరికినకాడికి దోచుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. సీసీటీవీ కెమెరాలు బిగించే పనిమీద ఎస్ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న ఆమె... చంద్రశేఖర్ మాయమాటలకు పడిపోయింది. భర్త ఇంట్లో లేని సమయంలో చంద్రశేఖర్ ఇంటికి వస్తుండేవాడు. అయితే సీసీటీవీల్లో రొమాన్స్ వీడియోలు రికార్డు అవుతున్నాయని గమనించిన ఆమె... చంద్రశేఖర్‌తో బయటికి వెళ్లడం మొదలెట్టింది. ఇద్దరూ పార్కులు, సినిమాలు, షాపింగ్‌లకు కలిసి వెళ్లేవారు. భర్తకు అనుమానం రాకుండా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తొలగించేశాడు చంద్రశేఖర్.

అయితే సీసీటీవీ ఫుటేజ్ కనిపించకపోవడం, భార్య తరుచూ బయట ఉన్నానని చెబుతుండడంతో అనుమానం వచ్చిన ఆమె భార్య... ఆమెను ఫాలో అయ్యాడు. చంద్రశేఖర్‌తో కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్యను తిట్టి, ఇంటికి వెళ్దామంటూ తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే భర్త ప్రవర్తనతో ఆగ్రహానికి లోనైన సదరు మహిళ... భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్నం తేవాలంటూ వేధిస్తున్నాడంటూ భర్తపై ఆరోపణలు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ఆమె భర్తను అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు నిజం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. చంద్రశేఖర్ నిజం స్వరూపం తెలుసుకున్న సదరు మహిళ... అతన్ని వదిలేసి రావడానికి ఇష్టపడకపోవడం కొసమెరుపు.
First published: May 6, 2019, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading