హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad : శిల్పా చౌదరికి మళ్లీ షాక్ -ఆ పనికి భర్తను వాడుకోలేదా? -కోర్టు అనూహ్య తీర్పు

Hyderabad : శిల్పా చౌదరికి మళ్లీ షాక్ -ఆ పనికి భర్తను వాడుకోలేదా? -కోర్టు అనూహ్య తీర్పు

నిందితురాలు శిల్పా చౌదరి

నిందితురాలు శిల్పా చౌదరి

తొవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతుండటంతో శిల్ప రిమాండ్ గడువు పెరుగుతూ పోతున్నది. తాజాగా ఉప్పర్ పల్లి కోర్టులో ఆమెకు మరోసారి చుక్కెదురైంది. అయితే మోసం కేసులో శిల్పతోపాటే అరెస్టయిన ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు మాత్రం కోర్టులో ఊరట లభించింది. వివరాలివి..

ఇంకా చదవండి ...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని సహా సినీరంగంలోని పలువురు సెలబ్రిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులను కోట్ల రూపాయాల మేరకు బురిడీ కొట్టించిన కిలేడీ శిల్పా చౌదరి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ నటీనటులు, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులకు నిత్యం ఖరీతైన పార్టీలు ఇస్తూ, హైదరాబాద్ పేజ్-3 పార్టీల సెలబ్రిటీగా ఒక వెలుగు వెలిగిన శిల్పా చౌదరి కిట్టీ పార్టీలు, అధిక వడ్డీ పేరుతో కోట్ల రూపాయాల మోసానికి పాల్పడటం, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నార్సింగ్ పోలీసులు ఆమెను గత నెలలో అరెస్ట్ చేయడం తెలిసిందే. తొవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతుండటంతో శిల్ప రిమాండ్ గడువు పెరుగుతూ పోతున్నది. తాజాగా ఉప్పర్ పల్లి కోర్టులో ఆమెకు మరోసారి చుక్కెదురైంది. అయితే మోసం కేసులో శిల్పతోపాటే అరెస్టయిన ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు మాత్రం కోర్టులో ఊరట లభించింది. వివరాలివి..

తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలపై అరెస్టయిన శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. కిట్టీ పార్టీల పేరుతో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని, వారికే టోకరా వేసిన శిల్పా చౌదరిని గత కొన్నిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. అయితే బెయిల్ కోరుతూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, సోమవారం నాటి విచారణలో ఆ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అంతేకాదు..

shilpa choudhary : సెలబ్రిటీ శిల్పా చౌదరి ఇలా అయిందే! -బ్యాంక్ అకౌంట్‌లో షాకింగ్ నంబర్ -మహేశ్ బాబు చెల్లికి మాత్రం..శిల్పా చౌదరిని మూడు రోజులపాటు విచారించిన పోలీసులు.. రిమాండ్ గడువు ముగియడంతో సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. గతంలో ఇచ్చిన మూడు రోజుల కస్టడీలో శని, ఆదివారాలు ఉండడంతో బ్యాంకు లావాదేవీల పరిశీలన సాధ్యం కాలేదని, మరికొన్ని రోజులు ఆమెను రిమాండ్ కు ఇస్తే ఖాతా వివరాలను పూర్తిగా సేకరించగలమని పోలీసులు కోర్టుకు విన్నవించారు. శిల్పా చౌదరికి జ్యూడీషియల్ రిమాండ్ గడువును వారంపాటు పెంచిన కోర్టు.. పోలీస్ కస్టడీకి మాత్రం ఒకే రోజు అనుమతిచ్చింది. అనూహ్యరీతిలో ఈ కేసులో సహ నిందితుడైన శిల్ప భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మోసాలు చేసే పనిలో శిల్ప తన భర్తను పూర్తిగా వాడుకుందనడానికి బలమైన ఆధారాలు లేకపోబట్టే ఆయనకు బెయిల్ వచ్చిందనే వాదనలున్నాయి. కోర్టు తీర్పుల అనంతరం శిల్పా చౌదరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Harnaaz Sandhu : విశ్వసుందరి అందాలు చూస్తే వావ్ అనాల్సిందే -Miss Universe 2021 ఎలా అయిందంటే..


కోట్లాది రూపాయాల మోసానికి పాల్పడగా, ప్రస్తుతం శిల్ప బ్యాంక్ ఖాతాలో రూ.16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ అకౌంట్ లో రూ.14వేలు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొల్లగొట్టిన సొమ్మును ఎటు తరలించారనేదానిపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, పోలీస్ విచారణలో శిల్ప ఒక ప్రపోజల్ తెచ్చినట్లు వెల్లడైంది. ప్రియదర్శిని(మహేశ్ బాబు చెల్లెలు), రేణుకా రెడ్డి, దివ్యారెడ్డి పెట్టిన మూడు కేసుల్లో రూ.7కోట్లకు సంబంధించి డబ్బులు తిరిగిచ్చేస్తానని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గతంలో అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసి, ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత శిల్పా రెడ్డి సెలబ్రిటీ పోజులు కొడుతూ, కోట్ల రూపాయాలు మోసానికి పాల్పడి చివరికిలా కటకటాలపాలైంది.

First published:

Tags: Cheating case, Hyderabad, Hyderabad police

ఉత్తమ కథలు