Home /News /crime /

HYDERABAD TV ART DIRECTOR ATTACKED IN BANJARA HILLS SU

Hyderabad: కుక్కపై రాయి విసరడంతో మొదలైన ఘర్షణ.. టీవీ ఆర్ట్ డైరెక్టర్‌కు తీవ్ర గాయాలు.. అసలు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమ వైపు వచ్చిన కుక్కపై రాయి విసరడంతో మొదలైన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో టీవీ పరిశ్రమలో పనిచేసే ఆర్ట్ డైరెక్టర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

    హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. కుక్కపైకి రాయి విసిరాడనే కారణంతో.. పలువురి వ్యక్తులపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. నందినగర్‌లో నివసించే యువకులు సందీప్, మనోజ్ శనివారం రాత్రి బస్టాప్ నుంచి వారుండే గదికి వెళుతున్నారు. పక్కన ఖాళీ స్థలంలో సందీప్ మూత్ర విసర్జనకు వెళ్లాడు. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే శ్రీను పెంపుడు కుక్కలతో వైపు వచ్చాడు. అయితే కుక్కలు తనవైపుకు రావడంతో భయపడిపోయిన సందీప్ రాయి విసిరాడు. కుక్కపైకి రాయి విసరడంతో.. శ్రీను సందీప్‌పై ఫైర్ అయ్యాడు. అసభ్య పదజాలంతో సందీప్‌ను దూషించాడు. ఈ క్రమంలోనే కొందరు శ్రీనుకు సపోర్ట్‌గా అక్కడకు చేరుకుని సందీప్, మనోజ్‌పై దాడికి పాల్పడ్డారు.

    తమపై దాడి గురించి సందీప్, మనోజ్‌లు వారి స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. టీవీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసే బొబ్బిలి సుదర్శన్, కొరియోగ్రాఫర్ కందుకూరి అనిల్, ఆదిత్య, మరో ఇద్దరు చేరుకున్నారు. వారు రావడంతో మరింతగా రెచ్చిపోయిన శ్రీను సపోర్ట్స్.. ఇనుప రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో బొబ్బిలి సుదర్శన్ తలకు బలమైన గాయమైంది. మిగిలిన వారికి స్వల్ఫ గాయాలయ్యాయి.

    Hyderabad: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. మీ కోసమే ఫ్రీ ఇన్సూరెన్స్‌ ఆఫర్.. ఫోన్ కాల్ చేసిన అమ్మాయి.. చివరకు..

    Telangana: ఆ జలపాతం పరిసరాల్లో లాక్‌డౌన్.. సందర్శన రద్దు చేసిన అధికారులు..

    ఈ ఘటనపై బాధితులు తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న అరుణ్, నర్సింగ్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకన్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Attack, Crime news, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు