8 రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఎంత నీచానికి పాల్పడ్డాంటే..

సెల్‌ఫోన్‌లో వీడియో చూసి భయంతో కేకలు పెట్టిందని కవర్ చేయబోయాడు. కానీ తల్లికి అసలు విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

news18-telugu
Updated: July 23, 2019, 9:24 AM IST
8 రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఎంత నీచానికి పాల్పడ్డాంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతనో అరబిక్ టీచర్.. హోమ్ ట్యూషన్స్ చెబుతుంటాడు.. మరో 8 రోజుల్లో అతని వివాహం..ఇదే క్రమంలో ఎప్పటిలాగే తన స్టూడెంట్‌కి పాఠాలు చెప్పేందుకు ఆరోజు ఆమె ఇంటికెళ్లాడు. కానీ ఆరోజు అతని కళ్లు కామంతో మూసుకుపోయాయి.బాలికను చూడగానే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెపై
లైంగిక దాడికి పాల్పడ్డాడు.హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలోని కేశవగిరిలో ఈ ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్‌ ఖయ్యూం(23) అనే యువకుడు కేశవగిరిలోని జీఎం కాలనీలో ఉన్న ఉస్మానియా ఘనీ మసీదులో ఉంటున్నాడు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన అతను ఉపాధి రీత్యా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇటీవలే అతనికి వివాహం కూడా నిశ్చయమైంది. మరో 8 రోజుల్లో అతను పెళ్లి చేసుకోబోతున్నాడు.ఇలాంటి తరుణంలో అతను ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.ఈ నెల 19న ఒక బాలిక ఇంటికి ట్యూషన్ చెప్పేందుకు వెళ్లిన అతను.. ఆ సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే చిన్నారిగట్టిగా అరవడంతో.. ఆమె తల్లి వచ్చి అతన్ని నిలదీసింది.సెల్‌ఫోన్‌లో వీడియో చూసి భయంతో కేకలు పెట్టిందని కవర్ చేయబోయాడు. కానీ తల్లికి అసలు విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని రిమాండుకు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
First published: July 23, 2019, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading