• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • HYDERABAD THEFT GANG TARGETING PERSONS WHO COMES FOR TRANSGENDERS IN JUBILEE HILLS AREA CR

హిజ్రాల కోసం వచ్చేవారే టార్గెట్... జూబ్లీహిల్స్‌లో ఘరానా దొంగల బ్యాచ్...

ప్రతీకాత్మక చిత్రం

గంజాయికి అలవాటు పడి, జల్సాల కోసం దోపిడీలు చేస్తున్న యువకుల గ్యాంగ్... హిజ్రాల దగ్గరికి వచ్చే విటులే టార్గెట్... ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన దోపిడీలు...

  • Share this:
హైదరాబాద్‌ నగర నడి ఒడ్డున అర్ధరాత్రి సంచరిస్తూ... హిజ్రాల దగ్గరకి వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోల్కొండలోని షజమ్ నగర్ ఏరియాకు చెందిన 24 ఏళ్ల అఫ్సర్ అహ్మద్ ఖాన్, బంజారాహిల్స్ ఏరియాలోని వెంకటేశ్వరనగర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మహ్మద్ సోహైల్, మాసబ్ ట్యాంక్‌ ఏరియాకు చెందిన 25 ఏళ్ల మహ్మద్ సలీమ్, 24 ఏళ్ల మహ్మద్ అబ్జల్, మోతీదర్వాజకు చెందిన 7 ఏళ్ల షేక్ ఫకీరుద్దీన్ కలిసి గ్యాంగ్‌గా ఏర్పడ్డాడు. ఒకే స్కూల్‌లో చదువుకున్న వీరంతా గంజాయికి అలవాటు పడ్డాడు. జల్సాల కోసం డబ్బు సరిపోక దొంతనాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే దొంగతనాలు చేసినా బయటపడకుండా ఉండేందుకు వీలుగా మాస్టర్ మైండ్‌తో ఆలోచనలు చేశారు. పడక సుఖం కోసం హిజ్రాల దగ్గరకి వచ్చే మగాళ్లను టార్గెట్ చేసుకుంటే... ఫిర్యాదు చేసేందుకు జంకుతారని భావించారు. అంతే నగరంలో ఉన్న హిజ్రాలు, వారి ఇంటి చిరునామా, తదితర వివరాలను సేకరించారు. రోజుకో దగ్గర కాపు కాస్తూ హిజ్రాల దగ్గరికి వచ్చే విటులను టార్గెట్ చేసుకుంటూ దోపిడీలు చేయడం మొదలెట్టారు. వారు అనుకున్నట్టుగానే దొంగతనానికి గురైన చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆరు నెలలుగా చోరీలు చేస్తూ... ఆ డబ్బుతో గంజాయి సేవిస్తూ, జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే గత నెల 10వ తేదిన జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్ ఇంటికి వచ్చాడు మౌలాలీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు. తన స్నేహితుడితో కలిసి హిజ్రాతో ఎంజాయ్ చేసి వస్తుండగా కాపుకాసిన యువకుల గ్యాంగ్... వారి దగ్గరనుంచి మొబైల్స్, రూ.10 వేల నగదు లాక్కున్నారు. అందరిలా వదిలేయకుండా బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందుల్లో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు... మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇప్పటిదాకా ఎంతమందిని దోచుకున్నారు? ఆ సొత్తంతా ఏం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

First published: