హైదరాబాద్‌లో ఆపిల్ కంపెనీ ఉద్యోగిని మిస్సింగ్...

హైదరాబాద్‌ ఆపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రోహిత కుత్తూరు అనే ఉద్యోగిని అదృశ్యం అయింది.

news18-telugu
Updated: January 3, 2020, 4:15 PM IST
హైదరాబాద్‌లో ఆపిల్ కంపెనీ ఉద్యోగిని మిస్సింగ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌ ఆపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రోహిత కుత్తూరు అనే ఉద్యోగిని అదృశ్యం అయింది. ఆమె డిసెంబర్ 26 నుంచి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మహిళ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మహిళ కుటుంబసభ్యులు కూడా ఆమె ఆచూకీ తెలిస్తే చెప్పాలని కోరుతున్నారు. హైదరాబాద్ ఆపిల్ కంపెనీలో పనిచేస్తున్న రోహిత కుత్తూరు డిసెంబర్ 26న మధ్యాహ్నం 3.15 గంటలకు గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఆటో ఎక్కుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇంటి నుంచి వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో ఆమె కోసం కుటుంబసభ్యులు మొత్తం గాలించారు. ఆమె ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్లడంతో ఆమె ఆచూకీ తెలుసుకోవడం సమస్యగా మారింది. దీంతో మూడు రోజుల వెతుకులాట తర్వాత చివరకు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును విచారించేందుకు సైబరాబాద్ పోలీసులు రెండు టీమ్‌లను నియమించారు.

First published: January 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు