లవ్ ఫెయిల్యూర్.. హైదరాబాద్ టెకీ ఆత్మహత్య..

ప్రేమ విఫలమైందని ఉరి వేసుకొని హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆరు నెలల నుంచి గచ్చిబౌలిలోని టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాగి కార్తీక్(22) ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు.

news18-telugu
Updated: January 30, 2020, 7:25 AM IST
లవ్ ఫెయిల్యూర్.. హైదరాబాద్ టెకీ ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రేమ విఫలమైందని ఉరి వేసుకొని హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆరు నెలల నుంచి గచ్చిబౌలిలోని టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాగి కార్తీక్(22) ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే.. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న అతడు మంగళవారం ఆఫీస్‌కు వెళ్లలేదు. అతడితో పాటు హాస్టల్‌లో ఉంటున్న మిగతా నలుగురు స్నేహితులు ఆఫీస్ వెళ్లాక లోపలి నుంచి గొళ్లెం పెట్టుకొనే ఉన్నాడు. ఆ నలుగురు స్నేహితులు రాత్రి 10 గంటలకు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తలుపు కొడితే ఎంతకూ తీయలేదు. వెంటనే.. తలుపు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్‌ను వేలాడుతూ కనిపించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లవ్ ఫెయిల్యూర్ కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడు కరీంనగర్ జిల్లా చౌలపల్లికి చెందినవాడిగా తేల్చారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 30, 2020, 7:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading