ప్రియుడి కోసం లక్షలు ఖర్చుపెట్టిన ప్రియురాలు... ఐదేళ్లు సహజీవనం చేసి...

ప్రియుడి చదువు కోసం లక్షలు ఖర్చుపెట్టిన ప్రియురాలు... మంచి ఉద్యోగం రాగానే ముఖం చాటేసిన ప్రియుడు... న్యాయం కోసం ప్రియురాలి మౌనపోరాటం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 1, 2019, 8:54 PM IST
ప్రియుడి కోసం లక్షలు ఖర్చుపెట్టిన ప్రియురాలు... ఐదేళ్లు సహజీవనం చేసి...
ప్రియుడి కోసం లక్షలు ఖర్చుపెట్టిన ప్రేయసి, ఐదేళ్లు సహజీవనం చేసిన తర్వాత...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 1, 2019, 8:54 PM IST
ఆమె అతన్ని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. తనకు సర్వస్వం అయిన ప్రియుడి కోసం తాను పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చుపెట్టింది. ప్రియురాలి డబ్బుతో ఉన్నత చదువులు చదువుకున్న అతను, ఆమెతో ఐదేళ్లు సహజీవనం కూడా చేశాడు. చదువులు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి, పెళ్లి చేసుకుందామనగానే పరారయ్యాడు. ప్రియుడి చేతిలో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు, అతని ఇంటి ముందు మౌనపోరాటం చేస్తోంది. వివరాల్లోకి వెలితే... తెలంగాణ రాష్ట్రంలోని దేవరకద్ర మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన మోహన్‌కుమార్, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. చిక్కడపల్లిలో ఓ గదిలో ఉంటూ చదువుకున్నాడు. ఈ సమయంలోనే అదే ఏరియాలో ఉన్న ఓ మహిళా కళాశాలలో చదువుకుంటున్న నర్మద అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆర్థికంగా వెనకబడిన మోహన్‌కుమార్, పెద్ద చదువులకయ్యే ఖర్చు భరించలేక చదువు మధ్యలోనే ఆపేయాలని భావించాడు. అయితే అతనికి తోడుగా నిలిచిన నర్మద, తన పెళ్లి కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బులు తీసి అతనికి ఇచ్చింది. ఇలా దాదాపు రూ.లక్షన్నర అతని కోసం ఖర్చుపెట్టింది.

చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం కూడా చేశారు. ఐదేళ్లు గడిచిన తర్వాత అతనికి ఓ పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. మంచి సంపాదన వస్తుండడంతో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నర్మద. అంతే అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టడం మొదలెట్టాడు మోహన్‌కుమార్... చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ప్రియుడి రాక కోసం కొన్నాళ్లు వేచి చూసిన నర్మద... అతని ఎంతకూ రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో అతని స్వగ్రామానికి చేరుకుని, మోహన్‌కుమార్ ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. నర్మద పోరాటానికి మహిళా సంఘాలు కూడా మద్ధతు పలకడం విశేషం.First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...