హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో... నిందితుడు హేమంత్ అరెస్ట్

ప్రియాంకతో చెడుగా ప్రవర్తించవద్దని హేమంత్‌ను వారించాడు సతీష్, అంతే సతీష్ మాటలకు హేమంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. స్నేహితుడని కూడా చూడకుండా ఎలా అయిన అతడ్ని అంతమొందించాలనుకున్నాడు.

news18-telugu
Updated: September 3, 2019, 9:12 AM IST
హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో... నిందితుడు హేమంత్ అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో  పోలీసులు పురోగతి చేశారు. నిందితుడు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. నగరశివారుల్లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రియాంకతో చెడుగా ప్రవర్తించవద్దని చెప్పినందుకు... సతీష్‌ను హేమంత్ హత్య చేసినట్లు తెలిపాడు. సతీష్ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురై  తానే... కత్తితో సతీష్ గొంతు కోశానని నేరాన్ని అంగీకరించాడు. తాను ఒక్కడే హత్యకు పాల్పడ్డాడని తెలిపాడు.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు