హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవదహనం

హైదరాబాద్‌‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని కొందరు సజీవదహనం చేశారు. చేతబడి చేశాడన్న అనుమానంతో అతడిని ఓ ఇంట్లో కట్టేసి దారుణంగా హత్యచేశారు.

news18-telugu
Updated: November 24, 2020, 9:01 AM IST
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవదహనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని కొందరు సజీవదహనం చేశారు. చేతబడి చేశాడన్న అనుమానంతో అతడిని ఓ ఇంట్లో కట్టేసి దారుణంగా హత్యచేశారు. జగిత్యాలలోని మల్యాల మండలం బల్వాంతపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాచర్ల పవన్ కుమార్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోని అల్వాల్ లో నివసిస్తున్నాడు. జగిత్యాలకు చెందిన విజయ్ అనే వ్యక్తి కొండగట్టుకు రెండు కిలో మీటర్ల చిన్న ఇల్లు కట్టుకున్నాడు. వారం రోజుల క్రితం విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు. జగన్, పవన్ బంధువులు అవుతారు. ఈ క్రమంలో విజయ్‌ను పరామర్శించేందుకు తన భార్య కృష్ణవేణితో కలసి పవన్ కొండగట్టుకు వెళ్లాడు. అయితే, తన తమ్ముడు జగన్ చనిపోవడానికి పవన్ కారణం అని విజయ్ అనుమానం వ్యక్తం చేశాడు. పవన్ చేతబడి చేయించడం వల్ల జగన్ చనిపోయాడని అనుమానించాడు. అతడి కుటుంబసభ్యులు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్తగా కట్టుకున్న చిన్న ఇంట్లోనే పవన్ కుమార్‌ను జగన్ భార్య సుమలత, కుటుంబసభ్యులు కట్టేశారు. అనంతరం ఆ ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో పవన్ సజీవదహనమయ్యాడు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమలతతో పాటు ఈ హత్యలో సహకరించిన వారిని అరెస్టు చేశామని డీఎస్పీ వెంకటరమణ వెల్లడించారు.

మరోవైపు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో మరో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ఒకరిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. తిర్యాణి మండలం తాటి మాదర గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు పట్టేలా ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి తన పంటపొలానికి ఉండేందుకు వెళ్ళాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో మెడ నరికి కిరాతకంగా హతమార్చారు. తెల్లారినా లచ్చు పటేల్ ఇంటికి రాకపోవడంతో పంటపొలానికి వెళ్ళి చూసిన తల్లికి రక్తం మడుగులో పడి కనిపించాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, మంత్రాలు చేస్తున్నాడని తరచూ బంధువులు గొడవపడేవారని, వారే ఈ హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఆత్రం మైనబాయి అనుమానం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ రాంనగర్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. స్థానికంగా ఓ పార్టీకి చెందిన నాయకుడు క్షుద్రపూజలు చేసి... ఆ వ్యర్థాలను వాటర్ ట్యాంక్‌లో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి చర్యలను గమనించిన కొందరు స్థానికులు... అతడిని ప్రశ్నించి నిర్బంధించారు. అతడిని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఘటనపై దర్యాప్తు చేశారు.

ప్రస్తుత కాలంలో శాస్త్ర, సాంకేతికత ఎంతలా పెరిగినా కూడా ఈ బాణామతి, చేతబడి లాంటి అనుమానాలు పోవడం లేదు. దీనిపై ప్రభుత్వాలు, హేతువాద సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కొందరు మూఢనమ్మకాలను వీడడం లేదు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 24, 2020, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading