సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ..పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో లక్షల నగదు, ఆభరణాలు చోరీకి గురైయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

news18-telugu
Updated: February 23, 2019, 12:56 PM IST
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ..పోలీసులకు ఫిర్యాదు
సినీ నటుడు మోహన్ బాబు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: February 23, 2019, 12:56 PM IST
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మోహన్ బాబు ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆయన మేనేజర్ శనివారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇంట్లో నుంచి లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి పనిమనిషే చేతివాటాన్ని ప్రదర్శించినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  ఇంట్లో నుంచి నగదు, ఆభరణాలు మాయం కావడంపై ఇంటి పనిమనిషులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీకి గురైన ఆస్తి విలువ ఇంతో స్పష్టంగా తెలియరావడం లేదు.


ఇటీవ‌లి కాలంలో పలువురు సినీ సెల‌బ్రిటీల ఇళ్లలో వ‌రుస దొంగ‌త‌నాలు జరిగాయి. ఇంట్లో నమ్మకంగా చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వారే తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్న ఆ మ‌ధ్య సినీ నటుడు చిరంజీవి ఇంట్లో చాలా ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తే రూ.2 ల‌క్ష‌ల చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇటీవల సినీ నటి భాను ప్రియ ఇంట్లోనూ మైనర్ బాలిక చోరీకి పాల్పడి పోలీసులకు దొరికిపోయింది.

 

First published: February 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...