హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad : ఆమెకు 32.. ఇద్దరు పిల్లల తల్లి.. అతను 22 ఏళ్ల బ్యాచిలర్.. అక్రమ సంబంధంలో అనూహ్య మలుపు

Hyderabad : ఆమెకు 32.. ఇద్దరు పిల్లల తల్లి.. అతను 22 ఏళ్ల బ్యాచిలర్.. అక్రమ సంబంధంలో అనూహ్య మలుపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ యువకుడి కోసం పిల్లల్ని, భర్తను కూడా వదిలేయడానికి సిద్దమైందామె.. కానీ సమాజం తన ప్రేమను అర్థం చేసుకోలేదేమో అనే సందేహంలో కొట్టుమిట్టాడింది.. ఆ అబ్బాయి కూడా వివాహిత కోసం ప్రాణాలిచ్చేంత పీక్స్ లో ఉన్నాడు.. చివరికి ఇద్దరూ కలిసి అడవికి వెళ్లి..

ఇంకా చదవండి ...

ఆమెకు ముందే పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. భర్తతో కలిసి హైదరాబాద్ లోని బోరబండలో ఉంటోంది.. కొంతకాలంగా ఆమెకు భర్తపై ఆసక్తి తగ్గిపోయి పక్క చూపులు చూసింది.. ఆమె పనిచేసే కంపెనీలో సహ ఉద్యోగి అయిన యువకుడితో పరిచయం పెరిగింది.. తరచూ కలుసుకునేదాకా వ్యవహారం వెళ్లింది.. క్రమంగా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.. ఆ యువకుడి కోసం పిల్లల్ని, భర్తను కూడా వదిలేయడానికి సిద్దమైందామె.. కానీ సమాజం తన ప్రేమను అర్థం చేసుకోలేదేమో అనే సందేహంలో కొట్టుమిట్టాడింది.. ఆ అబ్బాయి కూడా వివాహిత కోసం ప్రాణాలిచ్చేంత పీక్స్ లో ఉన్నాడు.. పెళ్లికి అడ్డంకులు తప్పవనే బాధలో ఇద్దరూ కలిసి సిటీకి దగ్గర్లోని అటవీప్రాంతానికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. కొన ఊపిరితో ఉండగా పోలీసుల కంటపడ్డారు. వివరాలివి..

ఓ వివాహిత ప్రియుడితో కలిసి విషం తాగిన సంఘటన కండ్లపల్లి అటవీప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా పూడురు పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలం చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన వివాహిత(32) ఆ ప్రాంతంలోనే నివసిస్తోన్న యువకుడి(22)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ యువకుడి స్వస్థలం వికారాబాద్ జిల్లానే. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. వివాహేతర సంబంధంతో ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా దగ్గరయ్యారు. అయితే తమ పెళ్లికి ఆటంకాలు వస్తాయని భావించి.. అటు కలిసుండలేక, ఇటు విడిగా బతకలేక బలవన్మరణానికి ప్రయత్నించారు. నిన్న రాత్రిపూట..

shocking : భర్త పురుషాంగాన్ని కోసేసిన భార్య.. బలవంతపు సెక్స్ భరించలేక.. ఆమెపై IPC 324సెక్షన్హైదరాబాద్ లోని కంపెనీలో మంగళవారం డ్యూటీ ముగించుకుని ఇద్దరూ కలిసి పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలోని నీలగిరి తోటకు వెళ్లి పురుగుల మందు సేవించారు. విష ప్రభావానికి నిమిషాల్లోనే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అడవిలో పడి ఉన్న ఈ జంటను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం వారిని వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు, పోలీసులు తెలిపారు. మహిళ వివరాలు సేకరించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాత్రిపూట తల్లి ఇంటికి రాకపోవడంతో పిల్లలిద్దరూ తల్లడిల్లిపోయారు..

First published:

Tags: Hyderabad, Lovers suicide, Married women, Vikarabad

ఉత్తమ కథలు