హోమ్ /వార్తలు /క్రైమ్ /

Rape Case: హైదరాబాద్‌లో అరాచకం... మహిళపై రేప్, హత్యాయత్నం... అత్యంత పాశవికంగా

Rape Case: హైదరాబాద్‌లో అరాచకం... మహిళపై రేప్, హత్యాయత్నం... అత్యంత పాశవికంగా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rape Case in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో కాస్త దారుణాలు తగ్గాయి అనుకునేలోపు... మరో అరాచక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. ఆ హత్యాయత్నం జరిగిన తీరు చాలా దారుణంగా ఉంది.

హైదరాబాద్.. మూసాపేటలో ఉంటోంది బాధితురాలు. 50 ఏళ్ల ఆమె... భర్తతో గొడవపడి... విడిగా తన తల్లితో ఉంటోంది. ఏదో కూలి పని చేస్తూ బతుకుతోంది. ఐతే... ఇదివరకు యాదవబస్తీలో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే సెంట్రింగ్‌ మేస్త్రీ రాము (38)తో పరిచయమయ్యాడు. అతనే ఇప్పుడు విలన్ అయ్యాడు. బాధితురాలు రోజూ కూలి పనికి వెళ్లి... తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మూసాపేట నుంచి నడస్తూ వచ్చేది. ఇది గమనించిన రాము... శుక్రవారం సాయంత్రం ఆమెను మూసాపేట నరసింహస్వామి ఆలయం దగ్గర ఆపాడు. "అరే మీరా... ఎలా ఉన్నారు... రండి... నేను కూడా మీ ఇంటి వైపే వెళ్తున్నాను. నా బైక్ ఎక్కండి" అన్నాడు. ఆమె "పర్లేదండి... నడుస్తూ వెళ్తాను" అంది. "అయ్యో అలా అంటారేంటి... పర్లేదు ఎక్కండి... ఏం నడుస్తారు" అనడంతో... సరే అని బైక్ ఎక్కింది.

కొంత దూరం వరకు బైక్ నెమ్మదిగానే నడిపిన రాము... ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. "ఎందుకు అంత స్పీడ్‌గా వెళ్తున్నారు" అని ఆమె అడిగితే... ఏమీ మాట్లాడకుండా... వేగంగా... రాఘవేంద్ర సొసైటీ వైపు బైకును నడిపాడు. ఆమె అటు ఎందుకు నడుపుతున్నారని అడిగితే... అస్సలు మాట్లాడకుండా నాటకాలాడాడు. సొసైటీ దగ్గర బైక్ ఆపాడు. ఆమె కంగారుగా దిగింది. వెంటనే ఆమెను బలవంతంగా లాక్కుపోయాడు. ఆమె వదలమని ఎంత అన్నా... వినిపించుకోకుండా... అక్కడి చెట్ల తుప్పల్లోకి లాక్కెళ్లి రేప్ చేశాడు.

ఆ తర్వాత ఆమెను చంపేయాలనే ఉద్దేశంతో... ఆమె తలపై బండరాయితో కొట్టాడు. దాంతో ఓ కన్ను చితికిపోయింది. ఆ తర్వాత ఆమె జననాంగాన్ని కట్ చేశాడు. అప్పటికే ఆమె శవంలా పడి ఉంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. "చచ్చింది" అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు.

రామూ వెళ్లిపోయిన కాసేపటి తర్వాత... ఆమె లేచి చూసింది. ఒంటిపై బట్టలు లేవు. లో దుస్తులతోనే... పాకుతూ తన ఇంటికి వెళ్లింది. తన కూతురిని చూసి తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె సాయంతో... పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితురాలిని పోలీసులు ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె కండీషన్ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు.

ప్రస్తుతం రాముతోపాటూ అతని కుటుంబ సభ్యులు కూడా పారిపోయారు. అతని కోసం కూకట్‌పల్లి పోలీసులు వెతుకుతున్నారు. రామూది శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల. 15 ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చి... మూసాపేటలో స్థిరపడ్డాడు.

ఇది కూడా చదవండి:Gold Prices Today: పెరుగుతున్న బంగారం ధరలు... రూ.63,000కు చేరుతాయా?

పైన చెప్పినది పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వెర్షన్. రేప్ ఒక్కరే చేశారా లేక రామూకి ఇంకా ఎవరైనా సహకరించారా అన్నది తేలాల్సి ఉంది. ఆమె కోలుకున్నాక స్టేట్ మెంట్ తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. తెలిసినవాడే కదా అని నమ్మితే... ఇంత దారుణానికి పాల్పడ్డాడు. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలి?

First published:

Tags: Hyderabad, RAPE, Telangana News

ఉత్తమ కథలు