ఇటుకల బట్టీ వెనకాల మాటేసి.. వివాహితను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్..

Hyderabad Crime: బహిర్భూమి కోసం బయటికి వచ్చిన ఓ మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 16న జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితులను రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

news18-telugu
Updated: August 22, 2019, 5:07 PM IST
ఇటుకల బట్టీ వెనకాల మాటేసి.. వివాహితను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బహిర్భూమి కోసం బయటికి వచ్చిన ఓ మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 16న జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితులను రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే.. ఒడిసాలోని బలంగీర్ జిల్లాకు చెందిన బాధితురాలు(30) జీవనోపాధి కోసం భర్త, రెండేళ్ల కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. నగర శివార్లలోని మహేశ్వరం మండలం నాగుల ధోని తండాలోని ఇటుక బట్టిలో పనిచేస్తోంది. వీరితోపాటు అదే జిల్లాకు చెందిన నలుగురు యువకులు రాహుల్‌ మాజీ(25), మనోజ్‌ సామ్రాట్(23), దుర్గా సామ్రాట్(20), దయా మాజీ(20) అక్కడే పనిచేస్తున్నారు.
కేసు వివరాలను వెల్లడిస్తున్న రాచకొండ పోలీసులు

అయితే, ఘటన జరిగిన రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బాధితురాలు బహిర్భుమి వెళ్లగా అప్పటికే కాచుకుని ఉన్న ఆ నలుగురు యువకులు ఆమెను వెంబడించి.. నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు వివరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే రేప్ చేశామని ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులు


First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు