హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: కాలేజ్ ఎదురుగా మసాజ్ సెంటర్.. మసాజ్ కోసమని లోపలికి వెళ్తే అంతే సంగతులు..

Hyderabad: కాలేజ్ ఎదురుగా మసాజ్ సెంటర్.. మసాజ్ కోసమని లోపలికి వెళ్తే అంతే సంగతులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జనావాసాల్లో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు.

అది పేరుకే మసాజ్ సెంటర్.. కానీ లోపల చేసేవన్ని పాడుపనులు. మసాజ్‌ కోసం లోనికి వెళితే అంతే సంగతులు. ఇలా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ షాదన్‌ కళాశాల ఎదురుగా చింతలబస్తీ మార్గంలో ఓ స్పా సెంటర్ నడుస్తోంది. అందులో మాత్రం నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మసాజ్‌ కోసం అక్కడిని వెళ్లిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం కాస్తా పోలీసుల చెవిన పడింది. దీంతో పోలీసులు మసాజ్ సెంటర్‌లో సాగుతున్న బాగోతాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రణాళికలు వేశారు.

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్‌ చంచల్‌ బాబు, సైఫాబా ద్‌కు చెందిన ఇద్దరు ఎస్‌ఐలు, పలువురు సిబ్బందితో కలిసి వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్లాన్ వేశారు. కొద్దిసేపట్లోనే ప్లాన్‌ను అమలు చేశారు. తొలుత ఓ కానిస్టేబుల్‌ను మసాజ్‌ సెంటర్‌కు పంపించారు. అతను వెళ్లి అక్కడ బేరం కుదుర్చుకున్నట్టు వారిని నమ్మించాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు సమాచారం చేరవేశాడు. దీంతో పోలీసులు మసాజ్ సెంటర్‌పై దాడులు చేపట్టారు. అక్కడ నిర్వహకులు హీనా తబస్సుమ్, జైనబ్‌ తబస్సుమ్‌తో పాటు విటులు మొయినుద్దీన్, పుర్కాన్‌అలీ, సాజిద్‌ఆలీ, మొయిన్‌ మహబూబ్‌ హుస్సేన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉద్యోగం కోల్పోయి కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా మారాడు.. గంటకు రూ. 5 వేలు.. భార్య ల్యాప్‌ట్యాప్ ఓపెన్ చేయడంతో..


తల్లిదండ్రులు అమ్మేశారు.. అత్తారింట్లో నెలల పాటు సాముహిక అత్యాచారం.. చివరకు ఓ రైల్లో..


అలాగే మసాజ్ సెంటర్‌లో ఉన్న ముగ్గురు యువతులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిర్వాహకులు, విటులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జనావాసాల్లో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగుతున్న విషయం తెలిసి స్థానికులు కూడా షాక్ తిన్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

First published:

Tags: Crime news, Hyderabad, Prostitution racket

ఉత్తమ కథలు