• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HYDERABAD POLICE TO INQUIRE KODELA SIVAPRASADA RAOS SON SHIVARAM BS

రెండు రోజుల్లో కోడెల తనయుడిని ప్రశ్నించనున్న పోలీసులు..

రెండు రోజుల్లో కోడెల తనయుడిని ప్రశ్నించనున్న పోలీసులు..

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆయన తనయుడు శివరాంను మరో రెండు రోజుల్లో విచారించనున్నట్లు సమాచారం. కోడెల ఆత్మహత్య వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? మానసికంగా వేధించారా? మరేమైనా సమస్యలు ఉన్నాయా? అన్న సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయన్ను విచారించనున్నారు.

  • Share this:
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆత్మహత్య జరిగిన రోజున కనిపించకుండా పోయిన ఆయన సెల్‌ఫోన్ ఇంకా దొరకలేదు. దీంతో కాల్‌ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఆయన దాదాపు పది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. చివరిసారిగా గన్‌మెన్ ఆదాబ్‌కు ఫోన్ చేసి 9 సెకన్ల పాటు మాట్లాడినట్లు తేల్చారు. ఆదాబ్‌తో కోడెల 24 నిమిషాల పాటు మాట్లాడారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, అందులో వాస్తవం లేదని, కాల్‌డేటాను పూర్తిగా విశ్లేషిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాంను మరో రెండు రోజుల్లో విచారించనున్నట్లు సమాచారం. కోడెల ఆత్మహత్య వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? మానసికంగా వేధించారా? మరేమైనా సమస్యలు ఉన్నాయా? అన్న సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయన్ను విచారించనున్నారు.

ఇదిలా ఉండగా, బంజారాహిల్స్‌లోని కోడెల నివాసం వద్ద సెక్యూరిటీని పెంచారు. ఎవరైనా ఇంటికి వస్తే తమకు సమాచారం అందజేయాలని స్థానికులకు పోలీసులు సూచించారు. కోడెల నివాసంలోని కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించారు. ఆ నివేదిక అందగానే మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సిద్ధం కానున్నారు.
First published:

అగ్ర కథనాలు