పెళ్లికి ఒప్పుకోలేదని చంపేశాడు.. మిస్టరీ వీడిన వారాసిగూడ హత్య కేసు..

ఏదో విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన షోయబ్ అక్కడే ఉన్న బండరాయిని తీసుకొని బాలికపై తలపై బలంగా మోదాడు. తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.


Updated: January 24, 2020, 10:54 PM IST
పెళ్లికి ఒప్పుకోలేదని చంపేశాడు.. మిస్టరీ వీడిన వారాసిగూడ హత్య కేసు..
ఏదో విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన షోయబ్ అక్కడే ఉన్న బండరాయిని తీసుకొని బాలికపై తలపై బలంగా మోదాడు. తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.
  • Share this:
హైదరాబాద్ వారాసిగూడలో ఇంటర్ విద్యార్థిని (17 ఏళ్లు) హత్యకేసును నగర పోలీసులు ఛేదించారు. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో షోయబ్ అనే యువకుడు విద్యార్థినిని హత్య చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు, నిందితుడు షోయబ్ పదోతరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఐతే ఆమె మైనర్ కావడంతో వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి షోయబ్‌ని ఆ బాలికను పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి తర్వాత బాలిక ఇంటికి వెళ్లాడు షోయబ్. ఇద్దరు కలిసి ఇంటిపైకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఏదో విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన షోయబ్ అక్కడే ఉన్న బండరాయిని తీసుకొని బాలికపై తలపై బలంగా మోదాడు. తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం ఆడ్చుకుంటూ వెళ్లి భవనం పైనుంచి ఆమెను కిందపడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

శుక్రవారం ఉదయం మృతురాలి తల్లిదండ్రులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాలిక పేరెంట్స్‌ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. షోయబ్ కొన్నిరోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. అతడే చంపిఉంటాడని వారు చెప్పడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లోనూ షోయబ్ వచ్చివెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. దాంతో షోయబ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: January 24, 2020, 10:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading