బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో ‘దిశ’పై అత్యాచారం, హత్య సందర్భంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ, తమ మతాన్ని కించపరిచారంటూ ఓ మహమ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 28న హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ మీద నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం షాద్‌నగర్ వద్ద ఆమెను దహనం చేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటనపై స్పందించిన రాజాసింగ్ నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఆరిఫ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.