డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఛైర్మన్ అశోక్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ

అశోక్ లొంగిపోవడానికి విధించిన 24 గంటల గడువు ముగియడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను అలర్ట్ చేశారు.

news18-telugu
Updated: March 6, 2019, 2:56 PM IST
డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఛైర్మన్ అశోక్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డేటా చోరీ కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధంచి ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను పోలీసులు అలెర్ట్ చేశారు. అలాగే దేశం విడిచి పారిపోకుండా అశోక్‌పై పోలీసులు ఎల్వోసీ జారీ చేశారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఐటీ గ్రిడ్ చైర్మన్ అయిన అశోక్‌ను లొంగిపోవాలని పోలీసులు సూచించినా ఇంతవరకు ఆయన లొంగిపోలేదు. అశోక్ లొంగిపోవడానికి విధించిన 24 గంటల గడువు ముగియడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. ఆయనకు ఇచ్చిన సమయం కూడా నిన్నటితో పూర్తవడంతో ఆయన్ను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే డేటాచోరీ కేసులో  హైదరాబాద్ లోని ఆయా సంస్ధల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కీలకమైన ఆధారాలు సేకరించడమే కాకుండా వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపారు. రేపటి కల్లా ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించిన డేటా వివరాలు కూడా పోలీసులకు చేరనున్నాయి. అదే సమయంలో సైబరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు వారు కోరిన సమాచారాన్ని ఎల్లుండి కల్లా అందజేస్తామని డేటా సర్వర్లు నిర్వహిస్తున్న అమెజాన్, గూగుల్ కూడా సమాచారం ఇచ్చాయి. దీంతో మరో రెండు రోజుల్లో తెలంగాణ పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Published by: Sulthana Begum Shaik
First published: March 6, 2019, 1:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading