సోషల్ మీడియా వేదికగా యువతులతో పరిచయాలు పెంచుకుంటున్న కొందరు వ్యక్తులు ఆపై వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తొలుత స్నేహంగా నటిస్తూ.. వారి వివరాలు సేకరించి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం పూలపర్తి గ్రామానికి చెందిన 21 ఏళ్ల భార్గవ్ ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కొన్ని నెలల కిందట తకను తెలియని ఓ యువతి నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అంటూ మెసేజ్ చేశాడు. అటువైపు నుంచి రిప్లై రావడంతో భార్గవ్ ఆనందపడ్డాడు. దీంతో ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆ యువతితో స్నేహం నటించిన భార్గవ్.. ఆమె వివరాలు సేకరించాడు.
అనంతరం ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను తెలుసుకుని వీడియో కాల్స్ ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో ఆమె పర్సనల్ ఫొటోలను సంపాదించాడు. అనంతరం అతని ప్లాన్ అమలు చేశాడు. నగ్నంగా కనిపించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. వాటిని వీడియో తీసి తరచూ కనిపించాలంటూ వేధింపులకు గురిచేశారు. లేదంటే అశ్లీల ఫొటోలను ఆమె స్నేహితులకు, బంధువులకు పంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
నిందితుడు భార్గవ్
దీంతో తెగ భయాందోళన చెందిన యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి.. నిందితుడు భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.