పనామాలో రూ.58 లక్షలు కొట్టేసింది తిరుచ్చి గ్యాంగ్... పోలీసుల అనుమానాలు...

Attension Diversion Case : రూ.58 లక్షలు అంత ఈజీగా కొట్టేసిన కేసు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. ఇది ఎలా సాధ్యమైందన్నది దర్యాప్తు చేస్తున్న పోలీసులకు... తిరుచ్చి ముఠాపై అనుమానాలు కలుగుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 1:28 PM IST
పనామాలో రూ.58 లక్షలు కొట్టేసింది తిరుచ్చి గ్యాంగ్... పోలీసుల అనుమానాలు...
సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు
  • Share this:
హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో పనామా జంక్షన్ దగ్గర యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన రూ.58 లక్షలను దుండగులు దోచుకెళ్లడంపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. మొదట ఎత్తుకెళ్లిన డబ్బు రూ.70 లక్షలు అని అనుకున్నా... మొత్తం లెక్కలు కట్టాక... అవి రూ.58 లక్షలు అని తేలింది. మంగళవారం మధ్యాహ్నం యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు మనీ లోడింగ్ వాహనంలో డబ్బులు తీసుకొచ్చారు సిబ్బంది. ఆ టైంలో అక్కడే ఎదురుచూస్తున్న ఇద్దరు దుండగులు... డబ్బులు కింద పడ్డాయని చెప్పి సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. డబ్బు కోసం సెక్యూరిటీ గార్డులు కిందకు వంగగానే... ఇద్దరు దుండగులు వాహనంలోని నగదు పెట్టెను ఎత్తుకుని పరారయ్యారు. అటుగా వస్తున్న ఓ ఆటోలో పెట్టెను పెట్టి వేగంగా ఆటోను పోనిచ్చారు. కొంతదూరం వెళ్లాక ఆటో లోంచీ పెట్టెను తీసుకొని పారిపోయారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.

దోపిడీకి పాల్పడింది తమిళనాడులోని తిరుచ్చికి చెందిన గ్యాంగ్‌గా పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ తర్వాత దొంగలు పారిపోయిన మార్గాల్లోని సీసీ కెమెరా దృశ్యాల్నిచూసిన పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. ఆ గ్యాంగ్ కోసం సిటీలో, సిటీ బయటా పోలీసు టీమ్స్ గాలిస్తున్నాయి. చోరీ తర్వాత దొంగలు వేర్వేరుగా సిటీ దాటి.. ఆ తర్వాత ఓ జట్టుగా మళ్లీ కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 20 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

చోరీ సెక్యురిటీ గార్డు నిర్లక్ష్యంగా ఎందుకున్నాడనేదానిపైనా దర్యాప్తు సాగుతోంది. ఎక్కువగా ఇలాంటి చోరీలకు పాల్పడేది తిరుచ్చికి చెందిన రామ్‌జీ గ్యాంగే. అందుకే ఇది కూడా ఆ ముఠా పనే అయివుంటుందనే అంచనా ఉంది. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామంటున్నారు.

CCTV Video:-వనస్థలిపురంలో భారీ చోరీ...


 

ఇవి కూడా చదవండి :Bigg Boss 3 : బిగ్ బాస్ 3 ఇప్పట్లో లేనట్లేనా...? జులై చివరి వరకూ ఆగాల్సిందేనా..?

ఏపీలో ఉగ్రవాదులు... హోటళ్లే టార్గెట్... అలర్టైన ప్రభుత్వం...

వరికుప్పపై ప్రాణాలు విడిచిన రైతు... తెలంగాణలో విషాదం...

బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?
First published: May 8, 2019, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading