HOME »NEWS »CRIME »hyderabad police arrested one for stealing bonsai plant worth above 1 lakh ms

Bonsai Plant: మొక్కను దొంగిలించినందుకు బొక్కలో తోశారు..

Bonsai Plant: మొక్కను దొంగిలించినందుకు బొక్కలో తోశారు..
దొంగిలించిన బొన్సాయ్ మొక్క (Image:Twitter)

Bonsai Plant: ఎప్పుడైనా మొక్క దొంగతనం చేస్తే కేసు పెట్టడం చూశారా...? ఆ మొక్కలో అంత స్పెషాలిటీ ఏముందనుకుంటున్నారా..? అంత ప్రత్యేకం కానిది ఆ దొంగ ఎందుకు దొంగిలిస్తున్నాడు చెప్పండి..

  • News18
  • Last Updated: January 15, 2021, 20:11 IST
  • Share this:
    ఎవరైన నగదో.. బంగారమో.. వెండి వస్తువులో... లేక ఇతర విలువైన వస్తువులనో దొంగిలించినప్పుడు పోలీసుల చేతికి చిక్కితే వారికి స్టేషన్ లో చేయాల్సిన మర్యాదలు చేస్తారు ఖాకీలు. అలా కాక ఎవరినైనా కిడ్నాప్ చేస్తేనో...లేక తాము ప్రాణంగా పెంచుకున్న జంతువుల (పెట్ డాగ్స్, గేదెలు, ఆవులు వంటివి) ను అపహరిస్తే కూడా గ్రామాల్లో కేసులు పెడతారు. ఇవేవీ కాక ఎప్పుడైనా మొక్క దొంగతనం చేస్తే కేసు పెట్టడం చూశారా...? ఆ మొక్కలో అంత స్పెషాలిటీ ఏముందనుకుంటున్నారా..? అంత ప్రత్యేకం కానిది ఆ దొంగ ఎందుకు దొంగిలిస్తున్నాడు చెప్పండి.. దాని విలువ అంత ఉంది మరి..

    హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జరిగిందీ ఘటన. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 18 వద్ద ఉంటున్న రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) వి అప్పారావు ఇంట్లో ఉన్న కసొరైన బొన్సాయ్ (casuraina bonsai plant) మొక్కను ఒక దొంగ దొంగిలించాడు. ఈ ఘటన ఐదు రోజుల క్రితం (ఆదివారం) చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే గొల్లపూడి ప్రసన్నాంజనేయులు, అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులు దీనిని దొంగతనం చేశారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు బైక్ పై వచ్చిన దొంగలిద్దరూ డీజీ ఇంట్లోకి చొరబడి ఆ మొక్కను దొంగిలించి తీసుకెళ్లారు.







    పదిహేను సంవత్సరాల వయసున్న బొన్సాయ్ మొక్కను చాలా రోజులుగా చూస్తున్న దొంగలిద్దరూ దానిని దొంగిలించాలని అనుకున్నారు. అందులో భాగంగానే స్కెచ్ వేసి దానిని ఎత్తుకెళ్లారు. రూ. 1.50 లక్షలు విలువ చేసే ఆ మొక్కను వేరే చోట అమ్మడానికి ఎత్తుకెళ్లినట్టు తెలుస్తున్నది. కాగా.. డీజీ ఇంట్లో ఉన్న రెండు సీసీ కెమెరాలు పనిచేయకపోయే సరికి దొంగల ఆచూకీ కనుగొనడం కొంచెం ఆలస్యమైందని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ వీధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా.. అందులో ప్రసన్నాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరి నుంచి మొక్కను స్వాధీనం చేసుకుని అప్పారావుకు అందించారు. ప్రసన్నాంజనేయులు పోలీసుల అదుపులో ఉండగా.. అభిషేక్ మాత్రం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని పోలీసులు వివరించారు.
    Published by:Srinivas Munigala
    First published:January 15, 2021, 20:11 IST