Home /News /crime /

HYDERABAD POLICE ARRESTED A MAN WHO THREATEN A WOMAN AFTER GIVEN MOBILE IN REPAIR SHOP HSN

మీ ఫోన్ రిపేర్ వచ్చిందా..? అయితే ఇలాంటి పొరపాటు మాత్రం చేయకండి.. ఈ యువతికి జరిగినట్టే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిల్ సుఖ్ నగర్ లోని వికాస్ నగర్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల అశోక్ పటేల్ జగదీష్ మార్కెట్లో గతంలో మొబైల్ రిపేర్ షాపును నిర్వహించాడు. కొంతకాలం పాటు మొబైల్ షాపును నడిపిన తర్వాత ఉన్నట్టుండి ఆ షాపును మూసేశాడు. ఆ తర్వాతే అతడి అసలు నిర్వాకం మొదలు పెట్టాడు. చివరకు..

ఇంకా చదవండి ...
    ఓ యువతికి ఓ వ్యక్తి నుంచి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తెలిసిన వ్యక్తి కాకున్నా ఆమె యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి అతడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. యువతి ఫొటోలను అసభ్యంగా చూపుతూ ఫేస్ బుక్ లో మెసేజులు పెట్టేవాడు. తనకు సంబంధించిన ఫొటోలు అతడికి ఎక్కడినుంచి వస్తున్నాయో ఆమెకు అర్థం కాలేదు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినవి అయితే అతడికి లభించే అవకాశం ఉంది కానీ, తన పర్సనల్ ఫోన్లో మాత్రమే ఉండే ఫొటోలు ఎక్కడినుంచి వచ్చాయో అర్థం కాలేదు. దీంతో పోలీసు కేసు పెట్టిందామె. తీరా పోలీసుల విచారణలో ఓ షాకింగ్ నిజం వెల్లడయింది. ఆ యువతి ఫోన్ ను అతడికి ఇవ్వడం వల్లే ఆ ఫొటోలను అతడు కలెక్ట్ చేసుకోగలిగాడని తేలింది. ఫోన్ పాడయిపోయిందని ఇస్తే, ఆ షాపు నిర్వాహకుడు చేసిన నిర్వాకం బయటపడింది.

    హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దిల్ సుఖ్ నగర్ లోని వికాస్ నగర్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల అశోక్ పటేల్ జగదీష్ మార్కెట్లో గతంలో మొబైల్ రిపేర్ షాపును నిర్వహించాడు. కొంతకాలం పాటు మొబైల్ షాపును నడిపిన తర్వాత ఉన్నట్టుండి ఆ షాపును మూసేశాడు. ఆ సమయంలో కొంత మంది తమ ఫోన్ పాడయిపోయిందంటూ, బాగుచేయమని రిపేర్ కు ఇచ్చారు. వాటిని కస్టమర్లకు ఇవ్వకుండానే షాపును మూసేశాడు. అలా అతడికి రిపేర్ చేయమని ఫోన్ ను ఇచ్చిన వాళ్లల్లో ఓ యువతి కూడా ఉంది.

    ఆ యువతి ఫోన్ ను బాగుచేసిన అశోక్, ఆమె వ్యక్తిగత ఫొటోలను కలెక్ట్ చేశాడు. ఫేస్ బుక్ లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, యాక్సెప్ట్ చేసేలా చేశాడు. ఆ తర్వాత ఆమెకు ఆ ఫొటోలను పెడుతూ బెదిరించసాగాడు. లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి రాచకొండ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేసింది. మొత్తానికి విచారణ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు