అమ్మాయిలే టార్గెట్... నకిలీ విజయ దేవరకొండ అరెస్ట్...

Vijay Devarakonda : హీరో విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలూ ఉన్నారు. దాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ నకిలీని పోలీసులు పట్టుకున్న విధానం సూపర్.

news18-telugu
Updated: March 7, 2020, 7:28 AM IST
అమ్మాయిలే టార్గెట్... నకిలీ విజయ దేవరకొండ అరెస్ట్...
విజయ దేవరకొండ (File)
  • Share this:
Vijay Devarakonda : అదో ఫేస్‌బుక్ అకౌంట్. దాని పేరు హీరో విజయ్ దేవరకొండ. దాని ప్రొఫైల్ ఫొటోలో ఉన్నది విజయ్ దేవరకొండ ఫొటో. అది చూసిన చాలా మంది ఆ అకౌంట్‌కి ఫ్రెండ్షిప్ రిక్వెస్టులు పంపుతున్నారు. అది నిజమైన విజయ్ దేవరకొండ అకౌంటే అనుకుంటున్నారు. అందులో రెగ్యులర్‌గా విజయ్ దేవరకొండకు సంబంధించిన విషయాల్ని అప్ డేట్స్ పెడుతున్నాడు దాన్ని క్రియేట్ చేసిన నకిలీ యువకుడు. ఆ అప్‌డేట్స్ చూసిన వాళ్లు... అది నిజంగానే విజయ్ దేవరకొండదే అనుకుంటున్నారు. అలా... తనకు రిక్వెస్టులు పంపుతున్నవారిలో... కొంత మంది అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటున్న నకిలీ... వాళ్ల రిక్వెస్టును యాక్సెప్ట్ చేసి... వాళ్లకు మెసేజ్‌లు పంపుతున్నాడు. "హాయ్ బ్యూటీ నువ్వు నాకు నచ్చావ్. నా నెక్ట్స్ మూవీలో ఛాన్స్ ఇద్దామనుకుంటున్నా. నాతో అలా వస్తావా" అని అడుగుతున్నాడు. మరికొంతమందినైతే... "నువ్వు కత్తిలా ఉన్నావ్. డేటింగ్‌కి వస్తే... సినిమా ఛాన్సులిస్తా" అంటూ మెసేజ్‌లు పంపిస్తున్నాడు.

దీనిపై డౌట్ వచ్చిన ఓ అమ్మాయి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. మొదట పోలీసులకు నమ్మకం కలగలేదు. కానీ... ఆమె చెప్పింది విన్నాక, ఆ అకౌంట్‌ని చూశాక షాక్ అయ్యారు. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఓ ట్రాప్ వేశారు. ముందుగా ఓ అమ్మాయి ఫొటోతో ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి... అతనికి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపారు. అతను ఓకే చేశాడు. "నీ ఫిగర్ అదిరింది. ఓసారి నన్ను కలిస్తే... సినిమా ఆఫర్ ఇస్తా" అన్నాడు. వెంటనే పోలీసులు... అతని మొబైల్ నంబర్ రాబట్టి... కాల్ చేసి... మిమిక్రీ ఆర్టిస్టు ద్వారా... అమ్మాయిలా మాట్లాడారు. తనతో మాట్లాడుతున్నది అమ్మాయే అనుకున్నాడు నకిలీ. మిమిక్రీ ఆర్టిస్టు... ఆ నకిలీని... హైదరాబాద్‌కి రమ్మన్నాడు. తన పంట పండిందనుకుంటూ... తన వలలో ఓ అమ్మాయి చిక్కిందనుకుంటూ... వేగంగా హైదరాబాద్ వచ్చేశాడు. వచ్చీ రాగానే పోలీసులు అతన్ని పట్టుకొని... పదరా స్టేషన్‌కి అంటూ తరలించారు.

నకిలీపై రెండు బాదగా... నిజాలు బయటికొచ్చాయి. అతను... కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతానికి చెందిన వాడు. విజయ్ దేవరకొండ అంటే... అమ్మాయిలు పడిచచ్చిపోతున్న విషయాన్ని గ్రహించాడట. అందుకే అతని నకిలీ అకౌంట్ క్రియేట్ చేశానని చెప్పాడు. అంతేకాదు... మరో ఇద్దరు హీరోల పేర్లతో కూడా అకౌంట్లు తెరిచినట్లు వివరించాడు. ఇలాంటి నకిలీ అకౌంట్లను నమ్మవద్దని విజయ్ దేవరకొండ ఆఫీస్ టీమ్... తమ అభిమానులను కోరింది. మొత్తానికి ఈ నకిలీ ట్రాప్‌ మోసగాణ్ని... హనీ ట్రాప్‌తో పోలీసులు పట్టుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
Published by: Krishna Kumar N
First published: March 7, 2020, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading