హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్స్ అసభ్య ప్రవర్తన.. గృహప్రవేశం జరుగుతున్న ఇంటికి వచ్చి..

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్స్ అసభ్య ప్రవర్తన.. గృహప్రవేశం జరుగుతున్న ఇంటికి వచ్చి..

హైదరాబాద్ నగర శివార్లలో ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. నూతన గృహ ప్రవేశం జరుగుతున్న చోటుకి వెళ్లి నానా హంగామా చేశారు.

హైదరాబాద్ నగర శివార్లలో ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. నూతన గృహ ప్రవేశం జరుగుతున్న చోటుకి వెళ్లి నానా హంగామా చేశారు.

హైదరాబాద్ నగర శివార్లలో ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. నూతన గృహ ప్రవేశం జరుగుతున్న చోటుకి వెళ్లి నానా హంగామా చేశారు.

  హైదరాబాద్ నగర శివార్లలో ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. నూతన గృహ ప్రవేశం జరుగుతున్న చోటుకి వెళ్లి నానా హంగామా చేశారు. ఇంటి యాజమానితో అసభ్యకరంగా ప్రవర్తించారు. బలవంతంగా డబ్బులు లాక్కొన్ని అక్కడి నుంచి పరారయ్యారు. వివరాలు.. దూలపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌ ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. సోమవారం కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్‌జెండర్లు స్వాతి, శ్రావణి, శివాని, భూమిలు అక్కడకు వచ్చి డబ్బుల కోసం డిమాండ్‌ చేశాడు. మల్లేష్ కుటుంబ సభ్యులు సర్దిచెప్పిన వినిపించుకోలేదు. ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడ భయానక వాతావరణం సృష్టించారు. మల్లేష్ ఇంటిపై రాళ్లు విసిరారు. మల్లేష్ కుటుంబ సభ్యులకు శాపనార్థాలు పెట్టారు. బూతులు తిడుడూ.. తమ బట్టలు విప్పి చూపిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అనంతరం మల్లేష్ జేబులో నుంచి రూ. 4 వేలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

  ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది గంటల్లోనే మల్లేష్ ఇంటి వద్ద అసభ్యకర రీతిలో ప్రవర్తించిన నలుగురు ట్రాన్స్‌జెండర్లను పేట్‌ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జూడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

  ఇక, కొన్ని వారాల క్రితం బాచుపల్లిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బాచుపల్లి ప్రగతి నగర్‌లో ఓ ఇంట్లో సత్యనారాయణ వత్రం జరుగుతున్న సమయంలో 10 మంది హిజ్రాలు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. రూ. 20వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అందుకు ఆ ఇంటి యజమాని నిరాకరించాడు. ఎంతో కొంత తీసుకుని వెళ్లాల్సిందిగా కోరాడు. అయితే అందుకు హిజ్రాలు అంగీకరించలేదు. తాము అడిగిన మొత్తం ఇవ్వాలంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే హిజ్రాలు అసభ్యకర రీతిలో అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దీంతో భయపడిన బాధిత కుటుంబం.. వారికి 16,500 రూపాయలు ముట్టజెప్పింది. ఆ డబ్బులు తీసుకుని హిజ్రాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  First published:

  Tags: Crime news, Hyderabad, Transgender

  ఉత్తమ కథలు