శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలో బంగారంతో ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కేజీ బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

news18-telugu
Updated: February 20, 2020, 12:16 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత..
పట్టుబడ్డ బంగారం
  • Share this:
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలో బంగారంతో ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కేజీ బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన సీటు కింద ఉన్న లైఫ్‌ జాకెట్‌లో అతడు బంగారాన్ని దాచినట్లు గుర్తించారు. బంగారం విలువ రూ.42.9 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిన్న సూడాన్‌కు చెందిన మహిళ ఆభరణాలను బంగారాన్ని బూట్లలో, లోదుస్తుల్లో తరలిస్తూ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. 290 గ్రాముల బరువున్న రెండు బంగారు బిస్కెట్లు, ఆభరణాలు బయటపడగా.. వాటి విలువ రూ.11లక్షలు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో కూడా ఇలాంటి బంగారం అక్రమ రవాణా వెలుగు చూసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు