హైదరాబాద్‌లో దారుణం.. పరీక్షకు వెళ్తుండగా బస్సు ఢీకొని మహిళ మృతి..

హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ఢీకొని ఓ యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.

news18-telugu
Updated: November 2, 2019, 12:59 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. పరీక్షకు వెళ్తుండగా బస్సు ఢీకొని మహిళ మృతి..
మృతురాలు కావ్య (ఫైల్)
  • Share this:
హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టి సైదాబాద్‌కు చెందిన జీ.కావ్య అనే మహిళ, 28 ఏళ్లు.. మృతి చెందింది. ఆ యువతి స్కూటీపై వెళ్తుండగా అటుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె.. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కావ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనతో చాధర్‌ఘాట్ ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది.

బస్సు సోనీ ట్రావెల్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా, ఆ మహిళ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సంబంధిత పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తూ దుర్మరణం చెందింది.

First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>