హైదరాబాద్‌లో ఏ సిగ్నల్ వద్దనైనా సరే రెడ్ లైట్ జంప్ చేసినా, హద్దు దాటినా, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా చలాన్ పడుద్ది. ట్రాఫిక్ నియంత్రణకు, వాహనదారుల ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసు శాఖ కొన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా సరే.. కొన్ని చోట్ల వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ శిక్షకు గురవుతుంటారు. కానీ, మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారాంబాగ్ వద్ద ఓ వాహనదారుడి వాహనాన్ని తనిఖీ చేయగా.. అతడి వాహనంపై 65 చలాన్లు ఉన్నట్లు వెల్లడైంది. ఆ మొత్తం ఎంతో తెలుసా.. రూ.11,040. దీంతో అతడి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
చలాన్‌ను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నగర వాసులు ట్రాఫిక్ నిబంధనలను ఫాలో అవ్వాలని సూచించారు. వెబ్‌సైట్ ద్వారా చలాన్లు ఉంటే పరిశీలించుకోవాలని తెలిపారు. జరిమానా పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలు తూ.చా. తప్పకుండా పాటించాలని కోరారు.
Tags: Hyderabad, Hyderabad police, Police, TRAFFIC AWARENESS, TS Police