హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్తకోణం.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు..

Hyderabad: ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్తకోణం.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు..

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోయిన కేసులో కొత్త కోణం వెలుగుచూసింది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోయిన కేసులో కొత్త కోణం వెలుగుచూసింది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోయిన కేసులో కొత్త కోణం వెలుగుచూసింది.

  హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసిందే. ముగ్గురు బాలికలు శనివారం ఉదయం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు విచారణలో ఈ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్వయంగా వారే ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారు ఇంటి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను సీసీటీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. కనిపించకుండా పోయిన బాలికల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ అవ్వడం తో ముగ్గరు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు.

  ఇక, హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుబానికి చెందిన.. 17 ఏళ్ల వయసున్న ఐశ్వర్య, 15 ఏళ్ల వయసున్న ఆస్మా, 14 ఏళ్ల వయసున్న అబీర్ లను ముగ్గురు కనిపింకుండా పోయారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఈ ముగ్గురు.. శనివారం ఉదయం కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోవడానికి పెద్దమ్మాయి ఐశ్వర్య ప్రేమ వ్యవహారమే కారణమని అంతా అనుమానిస్తున్నారు.

  Road Accident: ఘోర ప్ర‌మాదం.. అదుపు తప్పి లోయలో పడిన ట్రక్.. 10 మంది భక్తుల మృతి..

  Vakeel Saab: పవన్ కల్యాణ్, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య ఫైట్.. వకీల్ సాబ్ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో యువకుల వీరంగం..!


   తమ కూతుళ్ల అదృశ్యానికి స్థానిక ప్రగతి నగర్‌కు చెందిన రమేష్, అతడి స్నేహితులు కారణమయి ఉంటారని తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. రమేశ్ గతంలో ఐశ్వర్య వెంటపడేవాడని, ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  First published:

  Tags: Hyderabad, Telangana

  ఉత్తమ కథలు