ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై క్రిమినల్ కేసు...

నాంపల్లి కోర్టు ఆదేశాలతో వారు ఎంఐఎం ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 153(A), 153(B), 506 కింద కేసు నమోదైంది.

news18-telugu
Updated: November 21, 2019, 10:17 PM IST
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై క్రిమినల్ కేసు...
అక్బరుద్దీన్ ఒవైసీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ నాంపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాలతో వారు ఎంఐఎం ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 153(A), 153(B), 506 కింద కేసు నమోదైంది. కరీంనగర్ సభతో పాటు బీహార్‌లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారంటూ న్యాయవాది కరుణ సాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తమకు 15 నిమిషాల సమయం ఇస్తే.. అంతు తేలుస్తామంటూ గతంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, దానికి సంబంధించి కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో అక్బరుద్దీన్ ఒవైసీపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం వారు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>