హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై ఇంటి యజమాని లైంగిక దాడి..

దిశ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అమానుషంగా ప్రవర్తించాడో కామాంధుడు. ఇంట్లోకి పిలిచి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: January 8, 2020, 11:17 AM IST
హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై ఇంటి యజమాని లైంగిక దాడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అమానుషంగా ప్రవర్తించాడో కామాంధుడు. ఇంట్లోకి పిలిచి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనకు ఉన్న ఇంట్లో మూడు గదులను అద్దెకు ఇచ్చి ఓ గదిలో తాను ఉంటున్నాడు. అయితే ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబ సభ్యులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించి, ఆమెకు మాయమాటలు చెప్పి తన గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నొప్పి తాళలేక చిన్నారి కేకలు వేయడంతో ఆమెను విడిచిపెట్టాడు. ఇంట్లో ఏడ్చుకుంటూ ఉండిపోయింది.

తల్లిదండ్రులు ఇంటికి తిరిగివచ్చాక వారు అడగడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు