సైబర్ సిటీ, హైటెక్ సిటీ ‘హైదరాబాద్’లో 16 ఏళ్ల బాలికపై 11 మంది యువకులు అతి దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన సంఘటన సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. గొల్లాకిడి ఏరియాకు చెందిన 16 ఏళ్ల బాలికను ట్రాప్ చేసిన 11 మంది యువకులు... మాయమాటలు చెప్పి ఆమెను లైంగికంగా లోబరుచుకున్నారు. ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి... ఆ దారుణాన్ని వీడియోలు తీశారు. రేప్ వీడియోలను ఆన్లైన్లో పెడతామని నాలుగేళ్లుగా ఆమెను చిత్రవధకు గురిచేస్తూ... పిశాచి కోరిక తీర్చుకుంటున్నారు. అయితే నిందితులంతా ధనిక కుటుంబాలకు చెందిన పిల్లలు కావడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో FIR నమోదు చేయడం లేదని బాలిక నివసించే ఏరియాకు చెందిన 200 మంది స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.కామాటీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ దారుణం స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది.
స్థానికులు ధర్నా చేయడంతో కొద్దిగా హడావుడి చేసిన కామాటీపురా పోలీసులు... 11 మంది నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్, శుభం వ్యాస్, అజిత్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు... అయితే కీలక నిందితుడైన విజయ్‌తో పాటు మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు 4 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి గత నెల 24నే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు... అయితే వారి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులంతా కలిసి బాలికకు జరిగిన అన్యాయానికి స్పందించి... ధర్నా చేపట్టడంతో FIR నమోదు చేసి నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన 8 మంది మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. అయితే వీరు బడా బడా వ్యాపార వేత్తల కుమారులు, రాజకీయ నాయకుల వారసులు కావడంతో కావాలనే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు డ్రామా ఆడుతున్నారని, నిందితులు ఎక్కడ, ఎవరి ఇంట్లో దర్జాగా విశ్రాంతి తీసుకుంటున్నారో అనే విషయాలను పోలీసులకు కూడా తెలుసని ఆరోపిస్తున్నారు బాలిక కుటుంబసభ్యులు.
నాలుగేళ్ల కిందట చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లిన విజయ్ అనే యువకుడు... ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు... ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు... ఆ తర్వాత అతని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని నాలుగేళ్లుగా యువకులు నరకం చూపిస్తున్నారు. ఇన్నాళ్లు వారి చిత్రహింసలను మౌనంగా అనుభవించిన బాలిక... తల్లికి విషయం చెప్పడంతో అసలు విషయం బయటికి వచ్చింది.
ఇది కూడా చదవండి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime