హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad Gang Rape : బీజేపీ రఘునందన్ చేతికి ఆధారాలు ఎలా వచ్చాయి? -కారులో ఉన్నవాళ్లే లీక్ చేశారా?

Hyderabad Gang Rape : బీజేపీ రఘునందన్ చేతికి ఆధారాలు ఎలా వచ్చాయి? -కారులో ఉన్నవాళ్లే లీక్ చేశారా?

బీజేపీ రఘునందన్ బయటపెట్టిన ఆధారాలు

బీజేపీ రఘునందన్ బయటపెట్టిన ఆధారాలు

ఇంత కీలకమైన ఆధారాలు రఘునందన్ చేతికి ఎలా చిక్కాయి? రెండు కార్లలో ఉన్న 10 మందిలో ఆరుగురు నిందితుల జాబితాలో ఉండగా, మరో నలుగురికి క్లీన్ చీట్ ఎలా ఇచ్చారు? నిందితులతో కలిసున్నవారే కారులోపలి దృశ్యాలను లీక్ చేశారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు..

ఇంకా చదవండి ...

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘హైదరాబాద్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం’ ఉదంతంలో అనూహ్య కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు, మరో ఎమ్మెల్యే సోదరుడి కొడుకు, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కొడుకు, సంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత కొడుకు.. ఇలా అందరూ బడాబాబుల పుత్రరత్నాలే నిందితులుగా ఉన్న ఈ కేసులో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడి ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అధికారిక వాహనంలో, మరో కారులో చోటుచేసుకున్న అఘాయిత్యం తాలూకు దృశ్యాల ఫొటోలు, వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాకు విడుదల చేయడంతో ఈ కేసు అనూహ్యమలుపు తిరిగింది.

వీడియో లీకైన తర్వాతే ఎమ్మెల్యే కొడుకును ఏ6గా చేర్చే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. అయితే, ఇంత కీలకమైన ఆధారాలు రఘునందన్ చేతికి ఎలా చిక్కాయి? రెండు కార్లలో ఉన్న 10 మందిలో ఆరుగురు నిందితుల జాబితాలో ఉండగా, మరో నలుగురికి క్లీన్ చీట్ ఎలా ఇచ్చారు? నిందితులతో కలిసున్నవారే కారులోపలి దృశ్యాలను లీక్ చేశారా? ఇందులో ఇంకేదైనా అనూహ్య కోణం దాగుందా? అనే అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు..

Hyderabad Gang Rape : అధికారిక వాహనంలోనే అత్యాచారం.. వీడియో లీక్‌తో ఏ6గా ఎమ్మెల్యే కొడుకు!


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 28న ఇక్కడి ఆమ్నీషియా పబ్బులో అందరూ 20 ఏళ్లలోపువారే పాల్గొన్న పార్టీ ఒకటి జరగ్గా, రుమేనియాకు చెందిన మైనర్ బాలికను ఇంట్లో దిగబెడతామంటూ 10 మంది అబ్బాయిలు (ఇందులో ఇద్దరు తప్ప మిగతావారంతా మైనర్లే) కార్లను మార్చుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ కేసుల్లో నిరుపేదలైన నిందితులను అక్రమంగా ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. బడాబాబుల కొడుకులను మాత్రం కాపాడుతున్నారనే ఆరోపణల నడుమ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆధారాలు బయటపెట్టారు.

CM KCR | Akunuri Murali : కాళేశ్వరం ప్రాజెక్టు మూసేయక తప్పదు : ఎందుకో చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్..


ఈ ఘటనకు సంబంధించిన నిందితుల ఫొటోలు, వీడియోలను రఘునందన్ బయటపెట్టారు. ఎంఐఎం ప్రజాప్రతినిధులు కొడుకులు, టీఆర్ఎస్ హోం మంత్రి మనవడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, నిందితుల వీడియోలు, ఫొటోలు రఘునందన్‌రావుకు ఎలా చేరాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడ్డ నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు..

Political Successors : ఆ స్థానంలో దత్తన్న కూతురికి లైన్ క్లియర్? -గ్రేటర్‌లో వారసుల హోరు..


జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఉదంతంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక, కొంతమంది మైనర్లు కలిసి ప్రయాణిస్తున్న కారులోని కొన్ని దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అసలు సంఘటన జరిగింది బెంజ్‌ కారులోనా? లేదా పోలీసులు చెబుతున్నట్టు ఇన్నోవా కారులోనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పబ్‌ నుంచి బేకరీకి వెళ్లేటప్పుడు రెండు కార్లలో పదిమంది ఉండగా తిరుగు ప్రయాణంలో ఐదుగురు మాత్రమే ఉన్నారు. పోలీసులు ఈ ఐదుగురే నిందితులని తేల్చారు. మిగతావారికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఇలా క్లీన్‌చిట్‌ ఇచ్చినవారిలో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా అతడి పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ మిగతా నలుగురి పాత్ర గురించి స్పష్టత ఇవ్వలేదు.

CM KCR | KTR : కేటీఆర్ సీఎం కావాల‌ని ఆంధ్రా యువ‌కుడి పాద‌యాత్ర‌.. దసరాకు కేసీఆర్ నిర్ణయం?


పబ్‌ నుంచి వెళ్లేటప్పుడు బాలిక బెంజ్‌లో నలుగురితో కలిసి ఎక్కినట్టు సోషల్‌ మీడియాలో ఉన్న వీడియోల ద్వారా తెలుస్తోంది. వీటిలో మైనర్లు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తారు? అనేది తేలాల్సి ఉంది. గ్యాంగ్ రేప్ ఘటన జరిగింది ఇన్నోవా కారులో అని పోలీసులే చెబుతున్నారు. ఇలాంటప్పుడు బెంజ్‌ను ఎందుకు సీజ్‌ చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, బెంజ్‌ను సీజ్‌ చేసి.. అందులో ఉన్న ప్రయాణించినవారిని వదిలేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారులో ప్రయాణించిన వాళ్లలో కొందరే ఫొటో, వీడియోలు లీక్ చేశారనే అనుమానాలు లేకపోలేవు. అదే నిజమైతే ఏ ప్రయోజనం మేరకు వారా పని చేశారు? అనేది తేలాల్సి ఉంది..

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Gang rape, Hyderabad, Minor rape, Raghunandan rao, Telangana

ఉత్తమ కథలు