దేశంలో సంచలనంగా మారిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో (Jubilee hills) మైనర్ బాలిక సాముహిక అత్యాచార ఘటనను (Gang rape) పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల తీరుపై పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం, రాజకీయ నాయకుల ఒత్తిడులకు గురై దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, పలు రాజకీయ పార్టీలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించగా, ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిలో ఒకరు మేజర్ కాగా, మరో ముగ్గురు మైనర్ లని సమాచారం.
ఆదివారం పోలీసులు మరో మైనర్ బాలుడిని (minor boy) అరెస్టు చేశారు. అతడిని జువైనల్ హోమ్ కి తరలించారు. దీనిలో ప్రధానంగా, సాదుద్దీన్ మాలిక్, తెలంగాణ వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారి కొడుకు ఉన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు ఉమ్రాన్ ఖాన్ ను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ తెలిపారు. త్వరలోనే మరో నిందితుడిని కూడా పట్టుకుంటామని అన్నారు. దర్యాప్తు రాజకీయాలకు అతీతంగా జరుగుందని, తప్పు చేసిన వారి బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదైన వదిలే ప్రసక్తే లేదని డీసీపీ జోయల్ డెవిస్ (Dcp zoel davis) స్పష్టం చేశారు. కాగా, మే 28 న హైదరాబాద్ లోని (Hyderabad) జూబ్లీహిల్స్ ప్రాంతంలో అమ్నేషియా పబ్ (Amnesia pub) నుంచి మైనర్ బాలిక పార్టీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా, సాముహిక అత్యాచారం ఘటన జరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా బీజేపీ నేత రఘనందన్ రావు ఘటనకు సంబంధించి నిన్న కొన్ని వీడియోలు విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘హైదరాబాద్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం’ ఉదంతంలో అనూహ్య కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు, మరో ఎమ్మెల్యే సోదరుడి కొడుకు, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కొడుకు, సంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత కొడుకు.. ఇలా అందరూ బడాబాబుల పుత్రరత్నాలే నిందితులుగా ఉన్న ఈ కేసులో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడి ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అధికారిక వాహనంలో, మరో కారులో చోటుచేసుకున్న అఘాయిత్యం తాలూకు దృశ్యాల ఫొటోలు, వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాకు విడుదల చేయడంతో ఈ కేసు అనూహ్యమలుపు తిరిగింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.