లవర్స్ ‘హాట్ స్పాట్స్’గా మారిన మెట్రో లిఫ్ట్‌లు... సీసీటీవీల్లో 'ముద్దులాట' దృశ్యాలు...

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన హైదరాబాద్ మెట్రో లిఫ్ట్‌లు... సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ తిన్న మెట్రో సిబ్బంది...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 8:52 PM IST
లవర్స్ ‘హాట్ స్పాట్స్’గా మారిన మెట్రో లిఫ్ట్‌లు... సీసీటీవీల్లో 'ముద్దులాట' దృశ్యాలు...
హైదరాబాద్ మెట్రో రైలు
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 8:52 PM IST
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునని చేపట్టిన నిర్మాణం హైదరాబాద్ మెట్రో. భాగ్యనగరానికి మణిహారంగా మారుతుందని భావించిన మెట్రోలో రోజుకి లక్షమంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. అయితే నడవలేని వృద్ధుల కోసం, వికలాంగుల సౌకర్యార్థం... స్టేషన్‌ల దగ్గర లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. నాలుగు వైపులా మూసుకుని ఉండే ఈ ఎలివేటర్స్... ఇప్పుడు కుర్రకారుకి హాట్ స్పాట్‌గా మారాయి. ఎక్కడా కాసింత ఏకాంతం దొరుకుతుందా అని ఎదురుచూసే కొందరు కసి ప్రేమికులు... ఈ లిఫ్ట్‌లను తమ అవసరానికి వినియోగించుకుంటున్నారు. తాజాగా ఈ లిఫ్ట్‌ల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ గమనించిన సిబ్బందికి... అందులో కనిపించిన దృశ్యాలు చూసి దిమ్మతిరిగినంత పనైంది.

సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని తెలియక కొందరు... ఉన్నాయని తెలిసి కూడా పట్టించుకోకుండా మరికొందరు లిఫ్ట్‌లో రెచ్చిపోయారు. కొందరు అదర చుంబనాలతో చెలరేగిపోతే... మరికొందరు మరికాస్తా ముందుకెళ్లి లిఫ్ట్‌లోనే శృంగారానికి రెఢీ అయిపోయారు. ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయి... ముద్దుల్లో తడిసిపోయారు. వీరంతా కూడా ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు కావడం విశేషం. ఇంటర్‌ నెట్ కేఫేలు, లవర్స్ పార్కులు... ఇలా ప్రతీచోటా నిఘా పెరిగిపోవడం, రద్దీ ఎక్కువైపోయి ఏకాంతం దొరకపోవడంతో అల్లాడిపోయిన రసిక ప్రేమికులకు... మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రో లిఫ్ట్‌లు ‘హాట్ స్పాట్‌’గా మారడం అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ప్రైవసీ కోరుకుంటూ మెట్రో లిఫ్ట్‌ల్లో ప్రయాణించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఈతరం ప్రేమికులు. ఒకరి ద్వారా మరొకరు... వారి ద్వారా ఇంకొకరు మెట్రో లిఫ్ట్‌ల్లో ఒక్కసారి ట్రై చేయమని రికమెండ్ కూడా చేస్తున్నారుట. ఇలా కొన్నిరోజులు పోతే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల కంటే... లిఫ్ట్ ఎక్కడం కోసం వెయిట్ చేసే లవర్స్ సంఖ్య పెరుగుతుందని భయం పట్టుకుంది మెట్రో సిబ్బందికి. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి దిమ్మతిరిగిన మెట్రో సిబ్బంది... వెంటనే పోలీసులకు దృశ్యాలను అందించారు.

First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...