హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: విద్యార్థినిపై మెడికల్ కళాశాల డైరెక్టర్ అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని చిన్నమ్మపై కూడా..

Telangana: విద్యార్థినిపై మెడికల్ కళాశాల డైరెక్టర్ అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని చిన్నమ్మపై కూడా..

ప్రతీకాత్మక చిత్రం(Image-Youtube)

ప్రతీకాత్మక చిత్రం(Image-Youtube)

Hyderabad: తన సర్టిఫికెట్లు అడిగినందుకు విద్యార్థినిపై కళాశాల డైరెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది ఏంటని ప్రశ్నించినందుకు విద్యార్థిని చిన్నమ్మపై కూడా అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంకా చదవండి ...

  కరోనా సమయంలో హాస్టల్ తెరిచి ఉంచడమే కాకుండా హాస్టల్ లో చదువుకుంటున్న విద్యర్థినిపై కళాశాల డైరెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సర్టిఫెకెట్లు ఇవ్వమని అడిగినందుకు ఇలా ప్రవర్తిస్తారా అంటూ విద్యార్ధిని చిన్నమ్మ ప్రశ్నించినందుకు ఆమెను కూడా అసభ్యపదజాలంతో దూషించారు. ఈ ఘటన

  ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్‌బీనగర్‌లోని డాక్టర్‌ జీ మెడికల్‌ అండ్‌ ఐఐటీ అకాడమీలో కీర్తన అనే విద్యార్థిని గత రెండేళ్లుగా విద్యనభ్యసిస్తోంది. కళాశాల ఫీజు విషయంలో మేనేజ్‌మెంట్, విద్యార్థిని మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తరగతి జరుగుతున్న సమయంలో కూడా కీర్తనను ఫీజు విషయంలో ఇబ్బందులకు గురిచేసేవారు. ఫీజు విషయంలో విసుగు చెందిన కీర్తన తన సర్టిఫికెట్లు ఇస్తే వెళ్లిపోతాను అని చెప్పింది. అప్పటి నుంచి ఆమెను కళాశాల డైరెక్టర్ వేధించడం మొదలు పెట్టాడు.

  స్టడీ అవర్స్‌లో అకాడమీ డైరెక్టర్‌ జగన్‌ యాదవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇది తట్టుకోలేక హాస్టల్‌లోనే పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కీర్తన చెప్పుకొచ్చింది. ఇక ఈ కాలేజీలో చదవలేను.. నా సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికెళ్లిపోతాను అని విజ్ఞప్తి చేస్తే బెదిరింపులకు పాల్పడినట్లు విద్యార్ధిని కీర్తన పేర్కొంది. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని పలుమార్లు చెప్పడంతో ఆమె రూ.50 వేలు చెల్లించింది. రూ. 50 వేలు చెల్లించినా తన సర్టిఫికెట్లు ఇవ్వకపోగా హాస్టల్ నుంచి కనీసం ఇంటికి పంపకుండా అడ్డుకున్నారని కీర్తన తెలిపింది. ఇలా తన సర్టిఫికెట్లు ఇవ్వకుండా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన చిన్నమ్మ మమతను సైతం కళాశాల డైరెక్టర్‌ జగన్‌యాదవ్, డ్రైవర్‌ శివ అడ్డుకున్నారని, ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు హాస్టల్‌ గేటు దగ్గర దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని కీర్తన ఆరోపించింది.

  తమ పై అసభ్యకరంగా ప్రవర్తించిన కళాశాల డైరెక్టర్ జగన్ యదవ్ తో పాటు డ్రైవర్ శివపై చర్యలు తీసుకోవాలని కీర్తన డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా సమయంలో హాస్టల్‌ మూసివేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి చిన్నమ్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జగన్‌యాదవ్, శివపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎల్‌బీనగర్‌ పోలీసులు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగునంగా కళాశాల యాజమాన్యం నడుచుకోవాలని లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Harassment, Hyderabad, Medical college, Telangana

  ఉత్తమ కథలు