స్నానం చేస్తుండగా దొంగ చాటున వీడియో తీశాడు.. అది తెలిసిన మహిళ..

Crime News: అతడు వీడియో తీస్తున్న దృశ్యాన్ని చూసిన మహిళ ఇంట్లో వాళ్లకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు.

news18-telugu
Updated: June 7, 2019, 1:30 PM IST
స్నానం చేస్తుండగా దొంగ చాటున వీడియో తీశాడు.. అది తెలిసిన మహిళ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 7, 2019, 1:30 PM IST
ఓ మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడో యువకుడు. ఆ వీడియోతో ఆమెను బెదిరించాలని, బ్లాక్‌మెయిల్ చేయాలని భావించాడు. అతడు వీడియో తీస్తున్న దృశ్యాన్ని చూసిన మహిళ ఇంట్లో వాళ్లకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా, ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుడికి ఏడాది పాటు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన ఓ మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఇదే ప్రాంతానికి చెందిన అవినాష్‌రెడ్డి 2014 ఏప్రిల్‌ 19న వీడియో తీశాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న బాలానగర్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణ పూర్తిచేసిన అనంతరం న్యాయమూర్తి శ్రీదేవి గురువారం తీర్పు వెల్లడించారు.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...