లాటరీ తగిలిందని చెక్కు పంపి.. హైదరాబాద్ వాసికి రూ.లక్షల్లో బురిడీ..

Hyderabad News: హయత్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి(54)కి జూలైలో సైబర్‌ నేరగాళ్లు కొరియర్‌లో ఓ చెక్కు పంపించారు. ఆయన పేరిట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.12.72 లక్షలకు ఆ చెక్కు తీసి ఉంది. నాప్‌టాల్‌ లక్కీ డిప్‌లో ఈ బహుమతి గెలుచుకున్నారంటూ పేర్కొన్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 26, 2019, 12:33 PM IST
లాటరీ తగిలిందని చెక్కు పంపి.. హైదరాబాద్ వాసికి రూ.లక్షల్లో బురిడీ..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇదో కొత్త రకం మోసం.. లాటరీ తగిలిందని చెక్కు పంపి లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. లాటరీ గెలుచుకున్నారంటూ ఫోను చేయడం ద్వారానో, మెయిల్‌ ద్వారానో చెబితే మోసపోవడం లేదని గ్రహించిన సైబర్ నేరగాళ్లు.. కొత్త పథకం వేశారు. హయత్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి(54)కి జూలైలో సైబర్‌ నేరగాళ్లు కొరియర్‌లో ఓ చెక్కు పంపించారు. ఆయన పేరిట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.12.72 లక్షలకు ఆ చెక్కు తీసి ఉంది. నాప్‌టాల్‌ లక్కీ డిప్‌లో ఈ బహుమతి గెలుచుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అందులో పొందుపర్చిన కస్టమర్‌ కేర్‌ ఫోన్‌ నంబర్‌కు అతడు ఫోన్ చేసి అడగ్గా.. బహుమతి గెలుచుకున్నది నిజమేనని చెప్పిన మోసగాళ్లు.. బాధితుడి బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలు సేకరించారు.

ఇంకేముంది.. ఆ తర్వాత నేరగాళ్లు తమ పావులు కదపడం మొదలు పెట్టారు. పలు దఫాలుగా ఫోన్ చేసి.. కొంత మొత్తం ఛార్జీలు కట్టిన తర్వాతే చెక్కు చెల్లుబాటు అవుతుందని చెప్పారు. అలా జూలై 27న మొదలైన వసూళ్ల పరంపర ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగింది. కైలాష్‌ పండర్‌, నిఖిల్‌రాయ్‌ పేరుతో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలకు మోసగాళ్లు ఏకంగా రూ.4.28 లక్షల్ని బదిలీ చేయించుకున్నారు. తర్వాత ఆర్‌బీఐ ఛార్జీల పేరుతో మరింత డబ్బు కట్టాలని వేధించడంతో బాధితుడికి అనుమానం వచ్చి నిలదీశారు. అంతే.. అప్పటి వరకు మోసగాళ్లు వినియోగించిన సెల్‌ఫోన్లు మూగబోయాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు