Hyderabad: మెట్రో స్టేషన్ వద్ద దారుణ హత్య.. నగరం నడిబొడ్డున ఘోరం

నారాయణగూడ మెట్రో స్టేషన పక్కనే ఓ శవ కనిపించడం.. ఒంటిపై గాయాలు ఉండడంతో.. ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

news18-telugu
Updated: November 14, 2020, 6:21 PM IST
Hyderabad: మెట్రో స్టేషన్ వద్ద దారుణ హత్య.. నగరం నడిబొడ్డున ఘోరం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దీపావళి వేళ హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. నగరం నడి బొడ్డున దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మెట్రో స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ మెట్రో స్టేషన పక్కనే ఓ శవ కనిపించడం.. ఒంటిపై గాయాలు ఉండడంతో.. ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే మెట్రో సిబ్బందికి చెప్పడంతో.. వారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐతే మృతుడి వివరాలు తెలియలేదు. అతడిని ఎవరిని చంపారు? ఎందుకోసం చంపారు? అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్ పరిధిలో లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నేరాలు జరిగితే ఆ మూడో కన్ను ఇట్టే పట్టేస్తుంది. ఇక మెట్రో స్టేషన్ పరిధిలో ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. స్టేషన్ చుట్టు పక్కల సీసీ కెమెరాలు ఉంటాయి. అలాంటి పటిష్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరణించిన వ్యక్తి ఎవరన్న వివరాలు తెలిస్తే.. కేసు దర్యాప్తు ముందుకు వెళ్లే అవకాశముంది. ఈ క్రమంలో అసలు ఎవరా వ్యక్తి? అని తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఐతే మెట్రో స్టేషన్ పక్కనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Published by: Shiva Kumar Addula
First published: November 14, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading