కుమార్తెతో అసభ్య ప్రవర్తన.. భార్య ఫిర్యాదుతో భర్త అరెస్ట్

భర్త నుంచి విడాకులు పొందిన ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. కొన్ని నెలల క్రితమే హఫీజ్ ఆమెను వివాహం చేసుకున్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత ఆమె తన పిల్లలను ఇంటి వద్ద వదిలి వచ్చి హఫీజ్‌తో ఉంటోంది.

news18-telugu
Updated: April 25, 2019, 7:40 AM IST
కుమార్తెతో అసభ్య ప్రవర్తన.. భార్య ఫిర్యాదుతో భర్త అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 25, 2019, 7:40 AM IST
భార్యను నిత్యం వేధించడమే కాక.. ఆమె కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో భర్త. భర్త వేధింపులను భరిస్తున్న ఆ భార్య.. కుమార్తె పట్ల కూడా అతను చెడుగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయింది. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మౌలాలి ఆర్టీసీ కాలనీలో నివసించే మహమ్మద్‌ హఫీజ్‌ (23) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో అతనికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. భర్త నుంచి విడాకులు పొందిన ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. కొన్ని నెలల క్రితమే హఫీజ్ ఆమెను వివాహం చేసుకున్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత ఆమె తన పిల్లలను ఇంటి వద్ద వదిలి వచ్చి హఫీజ్‌తో ఉంటోంది.

కొద్ది రోజులు వీరిద్దరు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. హఫీజ్ తాగొచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో ఇటీవల ఆమె పెద్ద కుమార్తె(12) తల్లిని చూసేందుకు అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చింది. ఆ సమయంలో కుమార్తె ముందే హఫీజ్ ఆమె తల్లిని కొట్టాడు. ఆపై తాను ఇంట్లో లేని సమయం చూసి కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ దృశ్యాన్ని తాను చూశానని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు హఫీజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...