ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో హైదరాబాద్లోని పొక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన దోషికి.. పదేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి పొక్సో కోర్టు జడ్జి కే సునీత గురువారం తీర్పు వెలువరించారు. పొక్సో చట్టం కింద నిందితుడిని దోషిగా తేల్చినట్టు తెలిపారు. పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అతడు 5 వేల జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2019 డిసెంబర్లో.. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలిపై హత్యాచార యత్నం చేసేందుకు దోషి ప్రయత్నించాడు. దోషి కూతురు ఇంట్లో ఆశ్రయం పొందేందుకు బాధితురాలు 15 రోజుల కిందంటే హైదరాబాద్ నగరానికి వచ్చింది.
అయితే ఆ మైనర్ బాలికపై కన్నేసిన ఆ వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అయితే ఆ సమయంలో బాలిక గట్టిగా అరవడం, ఏడవడం ఓ వ్యక్తి విన్నాడు. ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆమెను రక్షించేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే దోషి బాలికను ఓ రూమ్లో బంధించి మరో డోర్ కూడా పారిపోయేందుకు యత్నించాడు. అయితే స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇక, తాజాగా ఆ కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన పొక్సో ప్రత్యేక కోర్టు.. 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.