హైదరాబాద్‌లో దారుణం... పెళ్లి కావడం లేదని...

తన పెళ్లి గురించి కుటుంబసభ్యులెవరూ పట్టించుకోవడం లేదంటూ స్నేహితుల దగ్గర బాధపడేవాడు సాబేర్.

news18-telugu
Updated: March 23, 2019, 9:54 AM IST
హైదరాబాద్‌లో దారుణం... పెళ్లి కావడం లేదని...
నమూనా చిత్రం
news18-telugu
Updated: March 23, 2019, 9:54 AM IST
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తనకు పెళ్లి కావడం లేదన్న కారణంతో ఓ యువకుడు నిండు ప్రాణం బలితీసుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎంఎస్ మక్తాకు చెందిన షేక్ హైదర్‌కు ఆరుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లు కాగా... నాలుగో సంతానం మహమ్మద్ సాబేర్‌కు మాత్రం ఇంకా పెళ్లి జరగలేదు. ఈ లోపే తల్లిదండ్రులు చనిపోయారు. అయితే సాబేర్ పెయింటింగ్ పనులు చేస్తూ ఒంటరిగానే నివసిస్తున్నాడు. తన పెళ్లి గురించి కుటుంబసభ్యులెవరూ పట్టించుకోవడం లేదంటూ స్నేహితుల దగ్గర బాధపడేవాడు సాబేర్. శుక్రవారం తన ఫ్రెండ్స్‌ దగ్గర బాధపడ్డాడు సాబేర్. ఉదయం 8 గంటల సమయంలో నెక్లెస్ రోడ్డు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ ట్రైన్ రాగానే... పరుగెత్తి వెళ్లి పట్టాలపై తలపెట్టాడు. అందరూ చూస్తుండగానే సాబేర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...