సోషల్ మీడియా వేదికగా యువతులతో పరిచయం పెంచుకుంటున్న కొందరు కామాంధులు.. వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. లైంగికంగా వాడుకుని వదిలేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా ఒక మ్యూజిక్ టీచర్‌తో పరిచయం పెంచుకుని మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. శ్రీనగర్ కాలనీలోని కరణ్ కాన్సెప్ట్‌కు చెందిన కరణ్‌రెడ్డి అనే వ్యక్తి మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ ఫ్రెండ్ రిక్వైస్ట్ను ఆ యువతి యాక్సెప్ట్ చేసింది. అనంతరం వారి మధ్య కొంతకాలం చాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలోనే వారిద్దరు స్నేహితులుగా మారారు.
ఈ క్రమంలోనే ఆమెతో ప్రేమను నటించిన కరణ్‌రెడ్డి.. ఆమె ఆర్థిక పరిస్థితిని క్యాష్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెను తన కార్యాలయానికి పిలిచాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తన కార్యాలయంలో ఆమెతో బలవంతంగా లైంగిక సంబంధం ఏర్పరుచుకున్నాడు. అయితే కొన్ని రోజులు అయ్యాక ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు.
దీంతో బాధిత యువతికి ఏం చేయాలో పాలుపోలేదు. ఫేస్బుక్ ద్వారా కరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఫేస్బుక్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే బాధిత యువతికి ఫోన్ చేసిన కరణ్ భార్య మానస ఫోన్ చేసి తన భర్తను మరచిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. అందుకు బాధిత యువతి అంగీకరించలేదు. దీంతో కరణ్రెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులు బాధిత యువతిపై బెదిరింపులు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.