ఎదురింటి మహిళను వ్యభిచారిగా చిత్రికరిస్తూ.. డేటింగ్ యాప్‌లో ఆమె ఫోన్ నెంబర్ పెట్టాడు..

ప్రతీకాత్మక చిత్రం

ఎదురింటి మహిళతో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి చాలా క్రూరంగా ఆలోచించాడు. ఆమెపై కక్ష తీర్చుకోవాలని భావించాడు.

 • Share this:
  ఎదురింటి మహిళతో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి చాలా క్రూరంగా ఆలోచించాడు. ఆమెపై కక్ష తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ ఫోన్ నంబర్‌ను డేటింగ్ యాప్‌లో పెట్టి మానసికంగా వేధించాడు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాలు.. గడ్డం రూబీకిరణ్ అనే 38 ఏళ్ల వ్యక్తి నాగోల్ బండ్లగూడలోని ఇంద్రప్రస్థ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అతడు ఓ ప్రైవేటు ఉద్యోగిగా ఉన్నాడు. అతనికి ఎదురింట్లో ఉంటే వివాహిత కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో గొడవలు ఉన్నాయి. వీటిని మనసులో పెట్టుకున్న అతడు.. ఆ కుటుంబంపై పగ పెంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం వాళ్ల ఆ మహిళ ఫోన్ నంబర్‌ను డేటింగ్ యాప్‌లో పెట్టాడు.

  తొలుత ఆ మహిళ వివరాలతో ఫేక్ మెయిల్ ఐడీ క్రియేట్ చేశాడు. ఇక, డేటింగ్ యాప్‌లో ఆమె వివరాలు, ఫోన్ నంబర్, అసభ్యకర సందేశాలు అప్‌లోడ్ చేశాడు. ఆమెను వ్యభిచారిగా చిత్రికరిస్తూ ప్రొఫైల్ సిద్ధం చేశాడు. దీంతో ఆమె ఫోన్‌కు, వాట్సాప్‌కు గుర్తు తెలియని నెంబర్ల నుంచి అసభ్యకర సందేశాలు రావడం మొదలైంది. ఈ వేధింపులు తాళలేక ఆ మహిళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన ఫోన్‌కు గుర్తుతెలియని నంబర్ల నుంచి సందేశాలు వస్తున్నట్టు ఫిర్యాదు చేసింది.

  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ డేటా సాయంతో అసలు విషయాన్ని గుర్తించారు. నిందితుడు రూబీకిరణ్‌ను గురువారం అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు.
  Published by:Sumanth Kanukula
  First published: