• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HYDERABAD MAN ARRESTED FOR BLACKMAIL HIS TIKTOK FRIEND SU

TikTok పరిచయం.. వాట్సాప్ చాటింగ్, కలిసి ఫొటోలు.. యువతికి మరొకరితో పెళ్లి కుదిరిందని తెలియడంతో..

TikTok పరిచయం.. వాట్సాప్ చాటింగ్, కలిసి ఫొటోలు.. యువతికి మరొకరితో పెళ్లి కుదిరిందని తెలియడంతో..

ప్రతీకాత్మక చిత్రం

టిక్‌టాక్ యాప్ ద్వారా పరిచయమైన యువతిపై ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిన ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకుని బ్లాక్‌మెయిల్ చేశాడు.

  • Share this:
    టిక్‌టాక్‌లో ఓ యువకుడితో పరిచయం యువతిని ఇబ్బందులకు గురిచేసింది. అతడు బ్లాక్‌మెయిల్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కొమ్మగోని కల్యాణ్‌ గౌడ్‌ ఓ కారు వాషింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అతడు టిక్‌టాక్ యాప్ వాడుకలో ఉన్న సమయంలో ఓ యువతిని ఫాలో అయ్యాడు. ఆమె పోస్ట్‌లకు లైక్‌లు చేస్తూ.. ఆమెతో పరిచయం పెంచుకునేందుకు చూశాడు. ఈ క్రమంలోనే యువతి నుంచి సానుకూలంగా స్పందన రావడంతో.. ఆమె నెంబర్‌ను తీసుకున్నాడు. ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుని.. ఇక, అప్పటి నుంచి వాట్సాప్ చాటింగ్‌ చేసేవారు. ఈ క్రమంలోనే కల్యాణ్.. యువతి కాలేజ్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె కలిసి మరింత పరిచయం పెంచుకున్నాడు.

    ఈ క్రమంలోనే ఆ యువతితో కలిసి సెల్ఫీలు కూడా దిగాడు. ఇలా కొన్ని రోజుల పాటు వారి మధ్య పరిచయం సాగింది. అయితే కొద్ది రోజులకు కల్యాణ్.. ఆ యువతికి లవ్ ప్రపోజ్ చేశాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. అయితే అందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆ యువతిపై కల్యాణ్ కోసం పెంచుకున్నాడు. ఇక, ఇటీవల ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయం తెలుసుకున్న కల్యాణ్.. ఆ యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు.

    ఈ క్రమంలోనే భయాందోళనకు గురైన యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. నిందితుడు కల్యాణ్ గౌడ్‌ను అరెస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు