హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో కారు బీభత్సం... ఇద్దరు మహిళలకు గాయాలు

దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై కారు అతివేగంగా దూసుకురావడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

news18-telugu
Updated: November 27, 2019, 9:40 AM IST
హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో కారు బీభత్సం... ఇద్దరు మహిళలకు గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం అనేకమంది అమాయకుల ప్రాణాల్ని బలితీసుకుంటుంది. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ మహిళలు వెంకటమ్మ , సత్తెమ్మగా గుర్తించారు. వీరిలో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై కారు అతివేగంగా దూసుకురావడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళల్ని ఢీకొని పల్టీలు కొట్టి మెట్రో డివైడర్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>